ఏపీలో మోడీ దోస్తీ ఎవరితో.. లైన్లో ముగ్గురు అధినేతలు !

With Whom Narendra Modi Alliance in Andhra Pradesh?
With Whom Narendra Modi Alliance in Andhra Pradesh?

ప్రస్తుతం ఏపీలో మోడీ దోస్తీ ఎవరితో అంటే.. ఎవరైనా తడుముకోకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు చెబుతారు. కరెక్టే ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీ మిత్రపక్షంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో కలిసి జనసేనతో కలిసి పోటీ చేయబోతున్నాం అంటూ కమలనాథులు ఇప్పటికీ పదే పదే చెబుతున్నారు. కానీ బీజేపీ కార్యకలాపాలలో జనసేన ప్రస్తావన గాని లేదా జనసేన కార్యాచరణలో బీజేపీ చోరువగాని ఎక్కడ కనిపించదు. ఈ రెండు మిత్రపక్ష పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా ప్రజల్లో ముందుకు సాగుతున్నాయి. ఆ మద్య బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం కాస్త అలిగి బీజేపీకు దూరంగా వ్యవహరించిన పవన్.. విశాఖలో మోడీ భేటీ అనంతరం.. మోడీ పాలనను ఆకాశానికెత్తెంతాలా పొగడ్తల వర్షం కురిపించారు.

దీంతో బీజేపీ జనసేన మద్య సయోధ్య కుదిరినట్లు వార్తలు గట్టిగానే వినిపించాయి. దీన్ని బట్టి చూస్తే టెక్నికల్ గా ఏపీలో మోడీ దోస్తీ పవన్ తో అనే విషయం అర్థమౌతోంది. అలాగని పూర్తిగా వైసీపీ టీడీపీ లను దూరంగా ఉండచడం లేదు మోడీ. కేంద్రంతో దోస్తీ కొరకు టీడీపీ విశ్వ ప్రయత్నలే చేస్తోంది.. అయితే టీడీపీకి దారులు మూసుకుపోయని, చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికి.. ఎన్నికల సమయానికి టీడీపీ, బీజేపీ జట్టు కట్టిన ఆశ్చర్యం లేదనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఇక జగన్ సర్కార్ పై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నప్పటికి.. కేంద్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మోడీతో దోస్తీని బలంగా కోరుకుంటునట్లే తెలుస్తోంది.

ఎందుకంటే విశాఖ సభలోనూ, అల్లూరి విగ్రహావిష్కరణలోనూ మోడీపై జగన్ చేసిన సానుకూల వ్యాఖ్యాలనూ బట్టి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమౌతోంది. ఇక మోడీ కూడా జగన్ దోస్తీ పై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో అక్రమాస్తుల విషయంలో ఈడీ దాడులు నిరవహిస్తున్న మోడీ సర్కార్.. ఏపీలో మాత్రం జగన్ పై అక్రమస్తుల కేసుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీన్ని బట్టి చూస్తే జగన్ దోస్తీని మోడీ కోరుకుంటున్నట్లు అర్థమౌతోంది. మరి ఏపీలో మూడు ప్రధాన పార్టీల అధినేతలు అయిన వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. మోడీ దోస్తీని బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో.. మోడీ కూడా సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఎన్నికల సమయానికి మోడీ అసలైన దోస్తీ ఎవరితో అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

షర్మిల అరెస్టుల మీద అరెస్టులు.. ఆమెకు లాభమేనా ?

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా ?

ప్రత్యర్థులపై కే‌సి‌ఆర్ టార్గెట్ !