కాపీ కొట్టడం ఎవరికీ కొత్తేం కాదు.. పరీక్షల్లో ఎంత సర్వసాధారణమో.. సినీ పరిశ్రమలో కూడా అంతే సాధారణం. అయితే ఇది ఇప్పుడు రాజకీయాల్లో కూడా ప్రవేశించినట్టు కనిపిస్తోంది. ఇటీవల తమిళనాడులో కోలీవుడ్ అగ్ర నటుడు కమల్‌హాసన్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చాడు. అట్టహాసంగా మధురైలో తన రాజకీయ ప్రవేశం పూర్తిస్థాయిలో ప్రారంభించారు. పార్టీ పేరు `మక్కల్ నీతి మయ్యం` (ఎంఎన్‌ఎం) అని ప్రకటించారు. దానికి అర్థం కూడా చెప్పారు. `పీపుల్స్ జస్టిస్ పార్టీ` అని తెలిపారు. అయితే పార్టీ లోగోను కూడా ప్రజలకు పరిచయం చేశారు.
`మక్కల్ నీతి మయ్యం` పార్టీ లోగో విజువల్‌గా క్రియేటివ్ స్టఫ్‌తో ఆకట్టుకుంటుండగా ఇది కాపీ వివాదం నెలకొంటుంది. పార్టీ లోగోపై అటు తమిళనాడు సహా దేశవ్యాప్తంగా అన్ని పొలిటికల్ కారిడార్లలో ఆసక్తికర రచ్చ చర్చ కొనసాగుతోంది. రెండు రకాల రంగుల్లో ఉన్న ఆరు చేతులు ఒకదానితో ఒకటి కలిపి ఉన్నాయి.
ఆ జెండా లోగోలో ఆరు చేతులు.. ఒకటికొకటి పెనవేసుకొని ఉంటాయి. మధ్యలో నలుపు రంగులో నక్షత్రం ఉంటుంది. ఆ చేతులు ఆరు దక్షిణాది రాష్ట్రాలు అని, ఆ నక్షత్రం ప్రజలుగా పేర్కొన్నారు. అయితే ఈ లోగో కాపీ క్యాట్ లోగో అంటూ ప్రచారం కొనసాగుతోంది. కమల్ హాసన్ పార్టీ లోగో వేరొక సంస్థ లోగో మాదిరిగా ఉంది. కెనడాకు చెందిన ఏసీఏఎఫ్ అనే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంస్థ లోగో మాదిరి కనిపిస్తోంది. ఆ సంస్థ లోగో కమల్ పార్టీ లోగో సేమ్ టు సేమ్ ఉండడం గమనార్హం.