Saturday, April 27, 2024
- Advertisement -

హమ్మ చంద్రబాబు… ఎంత పని చేశావ్

- Advertisement -

కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో లేకపోయినా… బ్యాక్ గ్రౌండ్ చేయాల్సిన పనులు చేసేస్తూనే ఉన్నాడు. ఎప్పటినుంచో బిజేపిలోకి అడుగుపెట్టాలని చూస్తోన్న కిరణ్ కుమార్ ఇపుడు ఆ ప్రయత్నాన్ని మానుకుని తాను సైలంట్ గా ఉంటూ… తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని యాక్టివ్ పాలిటిక్స్ లోకి దింపాలని చూస్తున్నాడు.ఇందుకోసమని ఆయన ఎంతో తెలివిగా తన బద్ద శత్రువైన చంద్రబాబు క్యాంప్ లోకి తమ్ముడిని పంపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. కాకపోతే… చంద్రబాబు మెజారిటీ తగ్గకుండా ఉండటం కోసమని నల్లారి వారి వారసుడిని తన పార్టీలోకి చేర్చుకున్నట్లుగా తెలుస్తోంది.

కిషోర్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు సరే. పీలేరు నుంచి అతనికి సీట్ ఇస్తానని హామి ఇవ్వకుండా కడపలోని రాజంపేట నుంచి సీట్ ఇస్తానని చెప్పడం చూస్తుంటే పొలిటికల్ ట్రిక్స్ ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. డైరెక్ట్ గా జగన్ ను ఎదురించలేక ఇలా చాపకింద నీరులా వ్యవహరించే ప్రయత్నం బాబు చేస్తున్నాడని టీడిపి శ్రేణుల్లోని వారే నవ్వుకుంటున్నారు.

అయితే ఇంకొందరు చెప్పేది ఎలా ఉందంటే… అతనికి కశ్చితంగా పీలేరు నుంచే సీట్ వస్తుందని అక్కడ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తాము ఫేస్ చేయలేమనే విషయం బాబుకు తెలిసే ఇలా కిషోర్ ను దించుతున్నారని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -