Sunday, May 5, 2024
- Advertisement -

నీతి, నిజాయితీ, విలువలు, వంకాయ….. తమరికి ఉండవా ఆర్కే?

- Advertisement -

చిన్న అవకాశం దొరికితే చాలు…. సీమాంధ్ర జనాలందరికీ విపరీతంగా నీతిబోధ చేస్తాడు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబుతో సహా అధికారంలో ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ చేతులెత్తేసిన నేపథ్యంలో రోడ్ల మీదకు వచ్చిన సీమాంధ్ర ప్రజలు ఆంధోళనతో ఆవేధన వ్యక్తం చేస్తే ఆ ఆవేధనను ఎటకారం చేశాడు ఆర్కే. విభజనకు వ్యతిరేకంగా ఏమీ చెయ్యొద్దు అని చెప్పి నీతి సూక్తులు చెప్పాడు. ఇక ప్రత్యేక హోదా విషయంలో కూడా సీమాంధ్రుల ఆందోళన అట్టర్ ఫ్లాప్. ఉద్యమాలతో ఉపయోగం లేదు అని చెప్పుకొచ్చాడు. ప్యాకేజ్ బహు గొప్పది అని చెప్పాడు. ఆ ప్యాకేజ్ వళ్ళ ఏ ఉపయోగమూ లేదని ఇప్పుడు చంద్రబాబే మొత్తుకుంటున్నాడు. ప్యాకేజ్ నిధులు కూడా నయాపైసా రావడం లేదన్న విషయం మాత్రం రాధకృష్ణకు వార్త కాదు.

ఆ రకంగా సీమాంధ్ర ప్రజలు ఆవేధనతో చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చడంలో పూర్తిగా సక్సెస్ అయిన రాధాకృష్ణ సీమాంధ్రకు తీరని ద్రోహం చేశాడు. చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసమే చేసినా వ్యూహాన్ని అమలుపరిచింది మాత్రం ఆర్కేనే. ఆయా సందర్భాలన్నింటిలోనూ సీమాంధ్రులకు బోలెడన్ని నీతి సూత్రాలు చెప్పాడు రాధాకృష్ణ. ఇక వైఎస్ జగన్ కోర్టు వ్యవహారాల విషయంలో రాధాకృష్ణ నీతుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ప్రజల కోసం పనిచేసే కలం యోధుడిని అన్న స్థాయిలో బిల్డప్ ఇస్తూ ఉంటాడు.

తాజాగా అదే రాధాకృష్ణపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ ఉండడంతో కోర్టుకు హాజరుకాలేకపోతున్నానని రాధాకృష్ణ చెప్పిన మాటలపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు పబ్లిషర్ అయిన రాధాకృష్ణకు ఏంటి సంబంధం? ఆయన ఏమైనా అసెంబ్లీ బీట్ చూసే జర్నలిస్టా? అసెంబ్లీ సమావేశాల రిపోర్టింగ్ కోసం అసెంబ్లీకి వెళ్తున్నాడా? అని చెప్పి జర్నలిజం గురించి అవగాహన ఉన్న రాజకీయ మేధావులు కూడా రాధాకృష్ణని విమర్శించారు. ఆ విషయాలు పక్కన పెడితే జగన్‌ విషయంలో కోర్ట్ సూచనలు చేస్తేనే తన ఇష్టారీతిన జగన్‌ని కోర్ట్ దోషిగా తేల్చేసింది అనే స్థాయిలో వండి వార్చే రాధాకృష్ణ… తనపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎందుకు కనీసం వార్తగా కూడా విశ్లేషించలేదు. సొంత మీడియాలో ఆయన గురించి ఆయనే వార్త రాసుకోవడం భావ్యం కాదు అని అనుకోవడానికి కూడా లేదు.

ఎందుకంటే సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు, నాయకులు యాగాలు, నాయకుల కుటుంబాలలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు……ఆయా కార్యక్రమాలకు రాధాకృష్ణ హాజరైతే గవర్నర్, ముఖ్యమంత్రి ఫొటోల కంటే ఎక్కువ ప్రాధ్యాన్యతను ఇష్తూ తన ఫొటోలను ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ చేసుకున్న చరిత్ర రాధాకృష్ణకు ఉంది. గొప్పలకు పోయినప్పుడు, జగన్‌ని విమర్శించాల్సి వచ్చినప్పుడు నీతుల వర్షం కురిపించే రాధాకృష్ణకు అవే నీతులు వర్తించవా? ఇతరులు చేస్తే వ్యభిచారం….తాను చేస్తే శృంగారం అనే సిధ్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడా? నికార్సయిన, నిస్పక్షపాత, నిస్వార్థ, నిబద్ధతలతో కూడిన జర్నలిజం నాది అని పేజీలకు పేజీలు తన సొంత డబ్బా తానే కొట్టుకునే రాధాకృష్ణ అసలు రంగు ఇదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -