Sunday, May 4, 2025
- Advertisement -

పవన్ దారిలో లోకేష్.. సక్సస్ అవుతాడా ?

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. పవన్ ఏ టాపిక్ గురించి వ్యాఖ్యానించిన అది తీవ్ర పోలిటికల్ హిట్ ను పెంచుతోంది. రోడ్ల విషయంలో గాని. అలాగే ప్రజాసమస్యలు తెరపైకి తీసుకురావడంలో గాని పవన్ చూపిస్తున్న చోరువ అందరి దృష్టి ని ఆకర్షిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్న పవన్.. ఆదిశగానే వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక వైసీపీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న పవన్.. అందుకోసం టీడీపీ తో పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్దంగా ఉన్నారు. దాంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది.

ఇక ఎక్కువ శాతం పవన్ గురించిన చర్చ జరగడం వల్ల ప్రజల దృష్టి ఆయన పై పడుతుంది. అది జనసేనకు మంచి మైలేజ్ తెచ్చే అవకాశం ఉంది. దాంతో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కూడా పవన్ దారిలోనే వెలుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ మాదిరిగానే ఫోకస్ అంతా కూడా తనపై ఉండేలాగా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. గతంలో ప్రత్యర్థి నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు ఇబ్బంది పడే లోకేశ్ ప్రస్తుతం పవన్ మాదిరి.. అగ్రెసివ్ గా మాట్లాడుతూ విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇక ఇటీవల ఇప్పటం గ్రామంలో రోడ్ల వెడల్పులో భాగంగా పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చడంపై పవన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం చెంది అక్కడ పర్యటించారు. అంతే కాకుండా ఇల్లు నష్టపోయిన కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా అంధించారు.

ఇలా తన సొంత డబ్బును పేదలకు ఇవ్వడంతో ప్రజల్లో జనసేనకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఇక ఇప్పటం గ్రామం విషయంలో కాస్త ఆలస్యంగా రియలైజ్ అయిన లోకేశ్.. పవన్ పర్యటించిన నాలుగు రోజులకు ఇప్పటంలో పర్యటించారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇలా నారా లోకేశ్ ప్రస్తుతం పవన్ ను ఫాలో అవుతూ తన పరిధి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి లోకేశ్ కూడా పవన్ మాదిరి ఏపీ రాజకీయాల్లో ఎంత మేర ప్రభావం చూపుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మోడీజీ.. ఆన్సర్ చెప్తారా ?

టీడీపీ కొత్త బాస్..బాబు వ్యూహమేంటి ?

ప్రధాని అంటే ఆయనే.. పరోక్షంగా మోడీపై సెటైర్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -