Thursday, May 2, 2024
- Advertisement -

ప్రశ్నలెన్నో.. సమాధానం చెప్తారా మోడీజీ !

- Advertisement -

చాలా రోజుల తరువాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు ( 11న ) ఆంధ్ర ప్రదేశ్ రానున్నారు. ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నేడు రాత్రి 7:30 గంటలకు ప్రధాని విశాఖ చేరుకొనున్నారు. ఇక రేపు ఉదయం 10 గంటల సమయంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని. వివిద ప్రాజెక్ట్ ల శంకుస్తపానాలు, పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు ఆయన ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని చాలా కాలం తరువాత ఏపీ పర్యటిస్తుండడంతో చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ ప్రయివేటీకరణ, విభజన హామీలు మరోసారి ప్రస్తావనకు వస్తున్నాయి..

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికి మోడీ సర్కార్ మాత్రం ప్రైవేటీకరణపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నట్లుగా వ్యవహరించింది. ఇక విభజన హామీలలో భాగంగా ప్రత్యక హోదా ప్రస్తావన తరచూ తెరపైకి వస్తూనే ఉంటుంది. అయితే ప్రత్యేక హోదా ఏ రాష్ట్రనికి లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు స్పష్టం చేసింది. అయితే విభజన తరువాత భారీగా నష్టపోయిన రాష్ట్రనికి స్పెషల్ స్టేటస్ చాలా ముఖ్యం. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రనికి అధనపు నిధులు సమకూరుతాయి.

కాబట్టి అభివృద్ది సులువౌతుందని, ఏపీకి ప్రత్యేక హోదా చాలా ముఖ్యమని ఆయా పార్టీల నేతలు తరచూ వారి గళాన్ని వినిపిస్తున్నప్పటికి మోడీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో ఈసారి ప్రధాని పర్యటనలో ప్రత్యేక హోదా ప్రస్తావన, అలాగే విశాఖా ప్రవేటీకరణ గురించి కాస్త గట్టిగానే ప్రధానికి విన్నవించాలని జగన్ సర్కార్ కు సూచిస్తున్నారు కొందరు రాజకీయవాదులు. అయితే వీటన్నిటి గురించి మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం లేదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే వీటిపై మోడీ ప్రస్తావిస్తే.. సరికొత్త రాజకీయ చర్చకు తెరలేచే అవకాశం ఉంది. మరి ప్రధాని ఎలాంటి వ్యాఖ్యాలు చేస్తారు. అసలు ఏపీ విభజన హామీల గురించి మాట్లాడతారా ? లేక తన ప్రసంగాన్ని నామమాత్రంగానే ముగిస్తారా ? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

గవర్నర్లు వర్సస్ ముఖ్యమంత్రులు.. అసలేంది ఈ రచ్చ ?

టీడీపీ విషయంలో బీజేపీ మెలిక..పవన్ కు ఇబ్బందే?

మోడీ రాకతో జగన్ బేజారు.. పవన్ హుషారు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -