Friday, May 17, 2024
- Advertisement -

టీడీపీ కొత్త బాస్.. టి‌ఆర్‌ఎస్ బీజేపీకి చెక్ పెడతారా ?

- Advertisement -

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తి.. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ టీడీపీనే. అలాంటి పార్టీ.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఒక్క ఏపీ వరకే పరిమితం అయింది. మొదట్లో తెలంగాణలో కొంత వరకు ప్రభావం చూపినప్పటికి ప్రస్తుతం అక్కడ టీడీపీ ఉందనే విషయమే చాలమంది మరిచిపోయారు. 2018 ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు కైవడం చేసుకున్నప్పటికి పార్టీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో గెలిచిన ఎమ్మేల్యేలు కూడా ఇతర పార్టీల గూటికి చేరారు. అయితే తెలంగాణలో టీడీపీని ప్రధానంగా దెబ్బతీసిన అంశం.. గత ఎన్నికల ముందు జరిగిన ఓటుకు నోటు సంఘటన. ఈ సంఘటన తరువాత టీడీపీ ఉనికే తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారింది..

ఇక అప్పటినుంచి తెలంగాణ టీడీపీ పై చంద్రబాబు ఫోకస్ చాలావరకు తగ్గుతూ వచ్చింది. ఫలితంగా టీడీపీ తెలంగాణలో ఏ పార్టీకి పోటీ ఇచ్చే పరిస్థితే కరువైంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ కి తిరిగి బలం పోసే పనిలో చంద్రబాబు ఉన్నారు. అడపాదడపా టీడీపీ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో బేటీలు నిర్వహిస్తూ అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇక ఈ మద్య తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందని మొదట్లో తెలుగు తమ్ముళ్ళు చెబుతూ వచ్చినప్పటికి, బాబు మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పార్టీని రేస్ లో నిలపాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారట.

అందుకే టీటీడీపీని పునః ప్రక్షాళన చేస్తున్నారు. అందులో భాగంగానే టీటీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించారు చంద్రబాబు. ఇక టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని బాబు పట్టుదలగా ఉన్నారట. మరి ప్రస్తుతం తెలంగాణలో టి‌ఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పటికి ఆ పార్టీ మూడవ స్థానానికే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో టీడీపీ తిరిగి రేస్ లోకి వస్తే రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి. అసలు ప్రధాన పార్టీలను ఎదుర్కోవడానికి చంద్రబాబు ఎలాంటి ప్రణాళికలు వేస్తారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఏపీలో ఉపఎన్నిక..రాబోతుందా ?

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

గవర్నర్లు వర్సస్ ముఖ్యమంత్రులు.. అసలేంది ఈ రచ్చ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -