Monday, May 5, 2025
- Advertisement -

మళ్ళీ తెర పైకి భైంసా.. ఆ ఎంపీ హౌజ్ అరెస్ట్..!

- Advertisement -

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో… భైంసాకు బయలుదేరిన.. నిజామాబాద్ ఎంపీ అరవింద్​ని బంజారాహిల్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.. ఈ క్రమంలో రోడ్​పై ఎంపీ అరవింద్​కు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ వాగ్వాదం దాదాపు 15 నిమిషాలపాటు జరగడంతో చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై తన వాహనాన్ని ఆపడం పట్ల ఆయన పోలీసులను ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

భైంసాకు వెళుతున్న సమాచారం ఉన్నందునే తాము అడ్డుకున్నట్లు పోలీసులు జవాబిచ్చారు. దీంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. వాగ్వాదం ముగిసిన అనంతరం ఎంపీ అరవింద్​ను గృహ నిర్బంధం చేసి.. ఇంటి వద్ద పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

మంత్రి సత్యవతి రాఠోడ్‌ కి కరోనా.. ముందు రోజే..!

హైదరాబాద్ లో బంగారం హవా.. ఎంత ఉందో తెలుసా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -