Friday, April 26, 2024
- Advertisement -

మహిళా దినోత్సవం సందర్భంగా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచుతున్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా లోటస్‌ పాండ్‌లో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని అన్నారు. ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు.

తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాష్ట్రంలో మహిళలు ఘోరంగా అన్యాయమయ్యారని షర్మిల అభిప్రాయపడ్డారు. ఉద్యమాల్లో మహిళలది కీలక పాత్ర అని, కానీ ప్రస్తుత తెలంగాణ సమాజంలో స్త్రీల ప్రాతినిధ్యం ఎంత అని ప్రశ్నించారు.  రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో మంది మహిళలు మంత్రి పదవులు అలంకరించారని, ప్రత్యేక రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత అది కూడా ఇద్దరికే అవకాశం ఇచ్చారని షర్మిల ఎద్దేవా చేశారు. 

ఇక ముందు ఇలాంటి అసమానతలు తమ పార్టీలో ఉండబోవని.. మహిళలకు మంచి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. మహిళలకు అన్నింటా నిర్దిష్ట కోటా ఉండాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని చెప్పారు. 

మంత్రి సత్యవతి రాఠోడ్‌ కి కరోనా.. ముందు రోజే..!

హైదరాబాద్ లో బంగారం హవా.. ఎంత ఉందో తెలుసా..!

విశాఖ స్టీల్ ప్లాంట్ వందశాతం ప్రైవేటీకరణ తప్పదన్నకేంద్రం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -