- Advertisement -

తెలంగాణ‌లో ఏక‌మ‌వుతున్న రెడ్లు…

- Advertisement -

తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కుతోంది. త్వ‌ర‌లో ప‌లు మార్పులు రాబోతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాల‌లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్రంలో ప్ర‌జ‌లంద‌రూ రెండుగా విడిపోయారు. కేసీఆర్ ఆధిప‌త్యానికి చెక్ పెట్టేందుకు రెడ్లంద‌రూ ఒక‌తాటిపైకి రాబోతున్నారు.

రెడ్ల సామాజిక వ‌ర్గం అంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఆ దిశ‌గా తెలంగాణ‌ కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలిస్తున్నాయి. టీడీపీలో మాస్ లీడ్‌గా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింది. దీని వెనుక జైపాల్ రెడ్డి ఉన్నార‌నేది బ‌హిరంగ ర‌హాస్య‌మే. రేవంత్‌ను పార్టీలో చేర్చుకొని టీఆర్ఎస్‌కు స‌వాల్ విసిరింది.

ఇప్పుడు తాజాగా భాజాపా సీనియ‌ర్ నేత నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం బీజేపీలో కొనసాగుతున్నా, క్రియాశీలకంగా లేని కార‌ణంగా నాగం జనార్దన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. నాగం వెనుక జైపాల్ రెడ్డి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా టీఆర్ఎస్ మ‌రియు కాంగ్రెస్ మ‌ధ్య‌నే పోటీ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. టీఆర్ఎస్ ఆధిప‌త్యానికి చెక్ పెడ‌తారా లేదా అనేది కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -