Thursday, May 16, 2024
- Advertisement -

అమెరికాలోనూ టిడిపి అధికారంలోకి వస్తుందిః నారా లోకేష్ డైలాగ్

- Advertisement -

లోకేష్ మళ్ళీ ఏసేశాడు. టాయిలెట్ నిర్మాణం దగ్గర కూడా …….ఇది ప్రపంచంలోనే నంబర్ ఒన్ అనే స్థాయిలో తండ్రి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నట్టుగానే లోకేష్ కూడా రెచ్చిపోయాడు. భారతదేశంలో ఉన్న చిన్న రాష్ట్రాల్లో ఒక చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తా, ఫుట్ బాల్ వరల్డ్ కప్ నిర్వహిస్తా, ప్రపచంలో నంబర్ ఒన్ చేస్తా అని చంద్రబాబు చెప్పగా లేనిది ‘అమెరికాలో కూడా టిడిపి అధికారంలోకి వస్తుంది’ అని తాను చెప్తే తప్పేముంది అని అనుకున్నాడో…….లేక తన తండ్రిలాగే మాటల విషయంలో మాత్రం తాను కూడా హద్దూ పద్దూ లేకుండా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడో కానీ చిన బాబు నారా లోకేష్ మాత్రం అమెరికాలో కూడా టిడిపి అధికారంలోకి వస్తుందని ఘనంగా ప్రకటించేశాడు.

అయితే లోకేష్ మాటలు విన్న ఎన్ఆర్ఐలు మాత్రం జీహెచ్ఎంసీలో ఘోర ఓటమి, తెలంగాణాలో టిడిపి పూర్తిగా చచ్చిపోతున్న విషయాలను ప్రస్తావించారు. లోకేష్‌తో సమావేశమయిన టిడిపి సానుభూతిపరులయిన ఎన్ఆర్ఐలు ‘ఎన్టీఆర్‌ని సిఎం అభ్యర్థిగా ప్రకటించాలని, అప్పుడే టిడిపి భవిష్యత్ తిరుగులేకుండా ఉంటుందని’ డైరెక్ట్‌గా లోకేష్‌తోనే చెప్పేశారు. 2009లో బాబు గెలుపు కోసం ప్రాణాలొడ్డి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ని ఎక్కడ లోకేష్‌కి పోటీ అవుతాడోనని చాలా తెలివిగా పక్కన పెట్టేశారు చంద్రబాబు, లోకేష్‌లు, పైగా సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్‌ని తొక్కెయ్యడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం టెంపర్ సినిమా నుంచీ వరుస హిట్స్‌తో టాప్ రేంజ్‌కి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా డైరెక్ట్‌గా లోకేష్‌తోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్టీఆర్‌ పేరుని ప్రకటించాలని కోరడం మాత్రం లోకేష్‌కి పీడకలగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. అమెరికాలో కూడా టిడిపి అధికారంలోకి వచ్చేలా చేస్తాం అన్న స్థాయిలో లోకేష్ భారీ స్టేట్మెంట్ ఇస్తే………టిడిపి ఎన్ఆర్ఐలు మాత్రం ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తేనే టిడిపి భవిష్యత్ బాగుంటుందని కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. లోకేష్‌పైన మరోసారి పంచ్‌లు, సెటైర్స్ వర్షం కురుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -