Saturday, April 27, 2024
- Advertisement -

స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొవాలంటే స‌ఫారీల‌కు కొంచెం టైం ప‌డుతుంది..జ‌ట్టు బ్యాటింగ్ కోచ్ డేల్ బెకెన్‌స్టైన్

- Advertisement -

దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌లో ఓడిపోయినా వన్డేల్లో మాత్రం టీమ్ ఇండియా ఇరగదీస్తోంది. సొంతగడ్డపై సపారీలకు చుక్కలు చూపిస్తోంది. తొలి వన్డేలో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్న మెన్ ఇన్ బ్లూ.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించారు. బంతితో చాహల్ దెబ్బకొడితే.. బ్యాట్‌తో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ పని పూర్తిచేశారు. 118 పరుగులకే సఫారీలను పరిమితం చేసిన భారత్.. లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

స‌ఫారీ బ్యాట్స్‌మేన్‌లంద‌రినీ పెవిలియ‌న్‌కు పంపించ‌డంలో చావ‌ల్ ముఖ్య‌పాత్ర పోషించాడు. తాజాగా స‌ఫారీ జ‌ట్టు బ్యాటింగ్ కోచ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భారత మణికట్టు స్పిన్నర్లని ఎదుర్కోవాలంటే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కి కొంచెం సమయం పడుతుందని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ డేల్ బెకెన్‌స్టైన్ అభిప్రాయపడ్డాడు. సెంచూరియన్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో వన్డేలో భారత స్పిన్నర్లు చాహల్ (5/22), కుల్దీప్ యాదవ్ (3/20) ధాటికి దక్షిణాఫ్రికా జట్టు 118 పరుగులకే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.

గతంలో తాము ఎదుర్కొన్న స్పిన్నర్ల కంటే.. చాహల్, కుల్దీప్ తక్కువ వేగంతో బంతులు వేస్తుండటం కూడా సఫారీ బ్యాట్స్‌మెన్ తడబాటుకి మరో కారణమని డేల్ వెల్లడించాడు. రెండో వన్డేలో లక్ష్యాన్ని భారత్ 20.3 ఓవర్లలోనే ఛేదించి ఆరు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే బుధవారం కేప్‌టౌన్ వేదికగా జరగనుంది.

ఇద్దరు మణికట్టు స్పిన్నర్లని ఒకే మ్యాచ్‌లో ఎదుర్కోవాలంటే చాలా కష్టం. దక్షిణాఫ్రికా జట్టులోని చాలా మంది బ్యాట్స్‌మెన్‌కి గతంలో చాహల్, కుల్దీప్‌ని ఎదుర్కొన్న అనుభవం లేదు. అందుకే.. వారి బౌలింగ్‌ని అర్థం చేసుకుని.. ఎదుర్కోవాలంటే కొంత సమయం పడుతుంద‌న్నారు.

గతంలో అనిల్ కుంబ్లే కూడా ఇలానే బ్యాట్స్‌మెన్‌కి దొరక్కుండా బంతుల్ని సంధించేవాడు. అయితే.. అతని బంతులు కొంచెం వేగంగా వచ్చేవి. కానీ.. చాహల్, కుల్దీప్ విసురుతున్న బంతులు చాలా నెమ్మదిగా వస్తున్నాయి. దక్షిణాఫ్రికా జట్టుకీ ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. వారి బౌలింగ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాం’ అని డేల్ బెకెన్‌స్టైన్ వెల్లడించాడు. తొలి వన్డేలో చాహల్, కుల్దీప్ ఇద్దరూ కలిసి 5 వికెట్లు తీయగా.. రెండో వన్డేలో ఆ సంఖ్య 8కి చేరడం విశేషం. ఇక మూడో వ‌న్డేలో చాహల్, కుల్దీప్ ఎలాంటి ప్ర‌భావం చూపుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -