Monday, June 17, 2024
- Advertisement -

ఒత్తిడి తెచ్చి మంత్రి కుర్చీ సాధించిన లోకేష్.. సిఎం కుర్చీ కూడా సాధించుకుంటాడా?

- Advertisement -

వైఎస్ జగన్‌కి ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవిపైనే కోరిక అని బాబుతో సహా పచ్చ జనాలందరూ కూడా ఎద్దేవా చేస్తూ ఉంటారు. కానీ రీసెంట్‌గా ఒక టిడిపి ఎమ్మెల్సీ చనిపోతే అదే ఎమ్మెల్సీ పదవి కోసం ఆ నాయకుడి ఇద్దరూ కొడుకులూ ఒకరితో ఒకరు యుద్ధం చేశారు. చివరకు ఏం చేయాలో తెలియక చంద్రబాబు కూడా తలపట్టుకున్నాడు. అలాగే కెటీఆర్‌ని కెసీఆర్ మంత్రిని చేసిన తర్వాత నుంచీ తనకూ మంత్రి పదవి కావాలని నారా ఇంట్లో రచ్చ రచ్చ చేశాడు లోకేష్. ఈ వ్యవహారంపై టిడిపి నాయకులే కథలు కథలుగా చెప్తూ ఉంటారు.

2019లో టిడిపి గెలిస్తే తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని నారా లోకేష్ ఆల్రెడీ వ్యూహం రచించాడని టిడిపి నాయకులు చెప్తున్నారు. మంత్రి పదవి విషయంలో లాగే ముందుగా నారావారి కుటంబ సభ్యుల చేతనే చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నాడట. అలాగే బాలయ్యతో సహా అందరూ కూడా లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేద్దాం అని చెప్పి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేలా లోకేష్ చేస్తున్నాడని టిడిపినేతలే చెప్తున్నారు. లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయడం చంద్రబాబుకు కూడా ఇష్టమే అని తెలుస్తోంది. అయితే టిడిపిలో యనమలతో సహా ఏ ఒక్క సీనియర్ నాయకుడికీ కూడా లోకేష్ కింద పనిచేయడం ఇష్టం లేదు. ఈ విషయమే బాబులో టెన్షన్ పెంచుతోంది. ఏది ఏమైనా 2019 ఎన్నికలు అయ్యేవరకూ మాత్రం చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెప్తారు. టిడిపి అధికారంలోకి వస్తే మాత్రం ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన అవసరం ఉంద అని చెప్పి ప్రచారం చేయించి….ప్రజలను నమ్మించి చంద్రబాబు జాతీయస్థాయి రాజకీయాలకు వెళ్లిపోతాడని తెలుస్తోంది. లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేస్తారట. ప్రస్తుతం టిడిపిలో ఈ విషయం హాట్ హాట్‌గా చర్చనీయాంశం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -