Thursday, May 16, 2024
- Advertisement -

సుజనాచౌదరి బ్లాక్‌మెయిలింగ్‌కి చంద్రబాబు లొంగిపోయాడా?

- Advertisement -

2014లో ఆంధ్రప్రదేశ్ నాట అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు సారథ్యంలోని టిడిపి ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి విషయమూ సుజనా చౌదరికి తెలుసు. ఇక ఓటుకు కోట్లుతో సహా చంద్రబాబు చేసిన తప్పులు, బొక్కలు అన్నింటి విషయంలోనూ సుజనా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అలాంటి సుజనా చౌదరి టిడిపిని వదిలిపోతుంటే చంద్రబాబులో ఎందుకు టెన్షన్ లేదు? యలమంచిలి రవి లాంటి నాయకులు పార్టీ వీడుతుంటేనే సకల ప్రయత్నాలు చేసీ…..ఎన్నో ఆఫర్స్ ఇచ్చిన బాబు, లోకేష్‌లు సుజనా చౌదరిలాంటి నారావారి అన్ని బొక్కలూ తెలిసిన నాయకుడు టిడిపిని వీడుతుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నట్టు?

ఇప్పుడు ఈ విషయమే పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే సుజనా చౌదరి-చంద్రబాబుల బంధం చాలా స్ట్రాంగ్ అని, వాళ్ళిద్దరూ ఎప్పుడూ విడిపోయే అవకాశం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజంగా సుజనా చౌదరి కనుక చంద్రబాబుకు దూరమై మోడీకి దగ్గరైతే మోడీకి సుజనా ఇచ్చే ఆధారాలతో కొన్ని గంటల వ్యవధిలోనే చంద్రబాబును మోడీ అడ్డంగా బుక్ చెయ్యొచ్చు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా సుజనా టీడీపీని వీడడంలేదు అని తెలుస్తోంది. 2019 తర్వాత మోడీనే అధికరాంలోకి రావడం ఖాయం అన్న విషయం బాబుకు స్పష్టంగా తెలుసు. మోడీపై ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో మోడీకి ప్రత్యామ్నాయం అనే స్థాయి నేత దేశంలో లేడు. రాహుల్‌తో పాటు ఇతర ప్రాంతీయ నేతలెవ్వరికీ కూడా అంత సీన్ లేదు. అందుకే మెజార్టీ తగ్గొచ్చేమో కానీ అధికారంలోకి మోడీ రావడం అయితే ఖాయమే. అందుకే చంద్రబాబు చాలా తెలివిగా మోడీ మెప్పుకోసమే సుజనాను భాజపాలోకి పంపిస్తున్నాడని తెలుస్తోంది. బ్యాంకు రుణాల ఎగవేతలతో పాటు ఇంకే కేసులు ఎదుర్కుంటున్న సుజనా చౌదరి కూడా చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి మరీ భాజపాతో ఒప్పందానికి వచ్చేలా చేశాడట. 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని…..కలిసి ప్రజల ముందుకు వెళ్తే ఇద్దరికీ కూడా డిపాజిట్లు కూడా రావని……టిడిపి సొంతంగానే పోటీ చేసినప్పటికీ ఎన్నికలు అయ్యాక మాత్రం కచ్చితంగా మోడీకే మద్దతిచ్చేలా ఒప్పందం కుదరిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -