Sunday, May 4, 2025
- Advertisement -

మోడీకి గుజరాత్ పై ఉన్న ప్రేమ.. దేశంపై లేదా ?

- Advertisement -

నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా అధికరంలోకి వచ్చి దాదాపుగా 8 ఏళ్ళు పూర్తి కావొస్తోంది. తొలుత ఆయన గుజరాత్ సి‌ఎం గా రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ది దేశంలో హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి విధితమే. దాంతో గుజరాత్ మోడల్ అని అభివృద్దిని అద్దంలో చూపిస్తూ 2014 ఎన్నికల్లో ప్రధాని రేస్ లో నిలిచి అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నరేంద్ర మోడీ. ఇక 2014 నుంచి ఇప్పటివరకు దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు అది ఎవరు కదనలేని విషయం. అయితే గుజరాత్ ఆయన సొంత రాష్ట్రం కావడంతో ఆ రాష్ట్రంపై ప్రేమ చూపించడం సాధారణ విషయమే..

కానీ ఇతర రాష్ట్రాలను సైతం పక్కన పెట్టి మరి కేవలం గుజరాత్ పైనే ప్రేమను కురిపించడం ఎంతవరకు సమంజసం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దేశ ప్రధానిగా అన్నీ రాష్ట్రాలను సమానస్థాయిలో చూడవలసిన బాధ్యత ప్రధానిపై ఉందని గుర్తు చేస్తున్నారు. ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మోడీ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. భారత్ అంటే కేవలం గుజరాత్ అన్నట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారటని వినోద్ కుమార్ విమర్శించారు. గడిచిన 6 నెలల్లో దాదాపుగా 80 వేల కోట్ల దేశ సంపదను కేవలం గుజరాత్ కే వెచ్చించారని, దేశంలో గుజరాత్ ఒక్కటే కాదు మిగిలిన రాష్ట్రాలు చాలా ఉన్నాయని విమర్శించారు. కేవలం గుజరాత్ కోసమే వేల కోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. మరి ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.

Also Read

మోడీజీ.. ఇది కరెక్టేనా ?

విజయసాయి రెడ్డి నయా న్యూస్ చానల్ !

కే‌సి‌ఆర్ కు గుజరాత్ పైనే గురి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -