Thursday, May 2, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ కు గుజరాత్ పైనే గురి ?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ టి‌ఆర్‌ఎస్ ను బి‌ఆర్‌ఎస్ గా పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన తరువాత.. బి‌ఆర్‌ఎస్ ఏ ఏ రాష్ట్రాలలో పోటీలో దిగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తరువాత మోడి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ నియంత పాలన సాగిస్తున్నారని, కేంద్రంలో బీజేపీ అధికరంలోకి వచ్చిన తరువాత మతఘర్షణలు పెరిగాయని.. ఇలా ఎన్నో రకాలుగా కే‌సి‌ఆర్.. మోడీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంతే కాకుండా 2024 లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని గద్దె దించుతానని పలు సందర్భాల్లో శపథం చేశారు కూడా. ఈ నేపథ్యంలో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. .

ఈ ఎన్నికల్లో కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ అయిన బి‌ఆర్‌ఎస్ పోటీలో నిలిచే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల గుజరాత్ మాజీ ముఖమంత్రి శంకర్ సింగ్ కే‌సి‌ఆర్ తో భేటీ అయ్యారు. దీంతో గుజరాత్ ఎన్నికలపై కే‌సి‌ఆర్ దృష్టి పెట్టారనే వార్తలకు మరింత బలం చేకూరింది. గుజరాత్ మోడల్ అంటూ 2014 ఎన్నికల్లో మోడీ ఎలాగైతే విజయం సాధించారో.. అదే విధంగా గుజరాత్ ఎన్నికల్లో తెలంగాణ మోడల్ అంటూ మోడీకి షాక్ ఇవ్వాలని కే‌సి‌ఆర్ ప్రణాళికలు వేస్తున్నాడట. అయితే గుజరాత్ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పోటీపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికి.. కే‌సి‌ఆర్ కచ్చితంగా పోటీలో నిలుస్తారని కొందరు చెబుతున్నా మాట.

ఒకవేళ గుజరాత్ ఎన్నికలో బి‌ఆర్‌ఎస్ పోటీలో నిలిస్తే.. సింగిల్ గానే బరిలోకి దిగుతుందా ? ఇతర పార్టీలలను కలుపుకొని బరిలోకి దిగుతుందా ? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత మోడీ టార్గెట్ గానే వ్యూహాలు రచించే అవకాశం ఉంది. మరి గుజరాత్ లో మోడీకి ఉండే మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మరి గుజరాత్ లాంటి హార్డ్ కోర్ బీజేపీ పాలిత రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ ఎన్నికల బరిలో నిలిస్తే.. ఎంత మేర రాణిస్తుందో చూడాలి.

Also Read

మునుగోడు బరిలో చంద్రబాబు.. ఎవరికి ముప్పు ?

ఎన్నికలంటే జగన్ కు భయమా ?

జగన్ను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -