Monday, April 29, 2024
- Advertisement -

మతవిద్వేషాలను మోడీ ప్రోత్సహిస్తున్నారా ?

- Advertisement -

కేంద్రంలో బీజేపీ అధికరంలోకి వచ్చిన తరువాత మత ప్రస్తావన తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.. హిందూ మతాన్ని మాత్రమే గొప్ప చేసి మాట్లాడడం.. మిగిలిన మతాలను తక్కువ చేసి మాట్లాడండం వంటివి తరచూ బీజేపీ నేతలు చేస్తూ ఉంటారు. దీంతో మత విద్వేషాలు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే మనదేశం సర్వమతల సమ్మేళనం. బిన్నత్వంలో ఏకత్వంగా అన్నీ మతాలు, అన్నీ కులాలు సమానమే అని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక తాజాగా డిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

ఇటీవల ఓ బహిరంగ సభలో ముస్లింలను టార్గెట్ గా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు మతవిద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయి. ” మేము వారిని బహిష్కరిస్తాం.. వారి దుకాణాల నుంచి ఏమి కొనము.. వారికి ఎటువంటి పని ఇవ్వం ” అంటూ ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే గతంలో కూడా కొందరు బీజేపీ నేతలు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చాలా సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. అయితే అధికార పార్టీ నేతలు ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నప్పటికి ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారనే సందేహాలు రాకమానవు.

హిందూత్వ ధర్మానికి బీజేపీ ప్రతిబింబంగా ఉన్నప్పటికి.. దేశ ప్రధానిగా అలాంటి రాజ్యంగ విరుద్దమైన వ్యాఖ్యలను మోడీ ఖండించాల్సిన అవసరత ఉంది. కానీ మోడీ మాత్రం ఏ రోజు కూడా ఖండించిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తే మతవిద్వేషాలను మోడీ ప్రోత్సహిస్తున్నారా ? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ కూడా మోడీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. ” ఓ కమ్యూనిటీ ని బహిష్కరించాలి.. గాడ్సే దేశ భక్తుడు.. మసీదులను తవ్వి చూద్దాం.. బానో రేపిస్టులు సంస్కారవంతులు ” ఇలాంటి వ్యాఖ్యలు వింటూ మోడీ సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కే‌టి‌ఆర్ ట్వీట్ చేశారు. మరి దేశంలో ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్న మతపరమైన వివాదలపై ప్రధాని మోడీ స్పందిస్తారా ? లేదా ? అనేది ప్రశ్నార్థకమే.

Also Read

పవన్ ప్రశ్నలకు సమాధానమేది ?

మునుగోడు బరిలో చంద్రబాబు.. ఆ ఓటు బ్యాంక్ చిలుతుందా ?

ఎన్నికలకు జగన్ భయపడుతున్నారా ? ఎందుకు మాట మార్చారు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -