Sunday, May 19, 2024
- Advertisement -

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ః ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి జగన్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలన్న ప్లాన్‌లో మోడీ

- Advertisement -

ఆగ్రహం, ఆవేశం, రంకెలు, శివతాండవం చేశాడని పచ్చ మీడియా బీభత్సమైన ప్రచారం చేసింది. తెగదెంపులు ఖాయం అని ఓ స్థాయిలో ప్రచారం చేశారు. నిజానికి మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఇప్పటి వరకూ చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. అంత ధైర్యం కూడా బాబుకు లేదు. అయితే పచ్చ మీడియా చేత మాత్రం బాగానే హంగామా చేయించాడు. ఆ రకంగా మోడీని కాస్త బెండ్ చేయాలని చూశాడు. అయితే బాబు వ్యూహం పసిగట్టిన మోడీ ఆ వెంటనే కౌంటర్ ప్లాన్ కూడా రెడీ చేశాడా? ఆ ప్లాన్ దెబ్బకే చంద్రబాబు మళ్ళీ పూర్తిగా సరెండర్ అయ్యాడా?

ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు వ్యవహారాలు అస్సలు నచ్చని మోడీ కూడా బాబుతో తెగదెంపులు చేసుకోవాలనే చూస్తున్నాడు. అయితే ఎన్ని రకాలుగా అవమానించినా బాబు మాత్రం పూర్తిగా దాసోహమన్నట్టుగా పడి ఉంటున్నాడు. అయితే బడ్జెట్ తర్వాత మాత్రం బాబు కాస్త హంగామా చేయాలని చూడడంతో మోడీ వెంటనే కౌంటర్ ప్లాన్ రెడీ చేశాడట. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి జగన్‌తో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలన్నదే ఆ ప్లాన్. అదే జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని ఎంపి సీట్లూ కూడా వైకాపా-బిజెపిలకే దక్కుతాయనడంలో సందేహం లేదు. ఈ ప్లాన్ గురించి ఇంటెలిజెన్స్‌తో తెలుసుకున్న చంద్రబాబు ఆ వెంటనే మరోసారి పూర్తిగా సరెండర్ అయిపోయాడని ఇప్పుడు ఢిల్లీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక ప్రధాన పచ్చ ఛానల్‌లోనే ఈ విషయం చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చి, జగన్‌తో కలిసి ఎన్నికలకు వెళ్ళాలన్న ప్రయత్నంలో మోడీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీతో తెగదెంపులు చేసుకోకూడదని సుద్దులు చెప్పింది ఆ ఛానల్. అయితే వార్త చదివిన జనాలు మాత్రం….పచ్చ మీడియాకు బాబు ప్రయోజనాలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పట్టవా? అని అనుకుంటున్నారు. ప్రత్యేక హోదా వచ్చే పనయితే జగన్-మోడీలు జట్టు కడితే మాత్రం ఏంటి? హోదా రాకపోయినా పర్లేదు …..బాబే అధికారంలో ఉండాలి అన్నట్టుగా వార్తలు ఇవ్వడం ఏంటి అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత జగన్‌తో పొత్తుపెట్టుకుని మోడీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల గోదాలోకి దిగాడంటే మాత్రం ప్రత్యర్థులకు డిపాజిట్స్ కూడా రావు అన్నది ఢిల్లీ రిపోర్ట్. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి. ఈ రాజకీయ పొత్తుల విషయం పక్కనపెడితే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తే మాత్రం రాష్ట్ర భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందనడంలో సందేహమే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -