Sunday, May 4, 2025
- Advertisement -

నిమ్మగడ్డ వీడియో సందేశం.. ప్రతి ఒక్కరికీ ఇది..!

- Advertisement -

రాష్ట్రంలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటుహక్కు వినియోగంపై ఎస్ఈసీ వీడియో సందేశం ఇచ్చారు. ఈ నెల 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికలలో ప్రతిఒక్కరూ విధిగా ఓటుహక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోరారు.

అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటేనే పంచాయతీలకు జవసత్వాలు వస్తాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. వ్యవస్థలు మెరుగైన పనితీరును జవాబుదారీ తనాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ఓటు వినియోగించుకునేందుకు అవసరమైన ప్రశాంత వాతావరణాన్ని కల్పించామన్నారు. పూర్తి భద్రత ఏర్పాట్లు చేశామని అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఈనెల 9 న తొలి దఫా పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 12 జిల్లాల్లో 18 రెవెన్యూ డివిజన్లు 168 మండలాల్లోని 3249 పంచాయతీలు, 32వేల 502 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓటు హక్కు వినియోగం, ప్రయోజనాలపై సందేశంతో కూడిన వీడియోను ఎస్ ఈసీ విడుదల చేశారు.

నిమ్మగడ్డ కి ఎదురు దెబ్బ..పెద్దిరెడ్డి కి గుడ్ న్యూస్..!

శృంగార నటి సన్నీలియోన్ పై అక్కడ చీటింగ్ కేసు.. కారణం అదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -