Monday, April 29, 2024
- Advertisement -

బాబులగా వెన్నుపోటుతో కాదు.. స్వశక్తితో వచ్చా: జగన్!

- Advertisement -

వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షణ రెండో విడత కార్యక్రమాన్ని శ్రీకాకులం జిల్లా నర్సన్న పేట లో నిర్వహించిన సి‌ఎం జగన్ ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వచ్చానని.. అలా వచ్చిన వారిని ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జగన్ అంటరాని, అలా కాకుండా మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాకున్నే వారిని చంద్రబాబు అంటారని వ్యంగ్యస్త్రాలు సంధించారు జగన్. వెన్నుపోటు రాజకీయాలు చేసిన వారిని అసెంబ్లీకి పంపాలా ? బైబై అంటూ ఇంటికి పంపాలా ? అంటూ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయడం బాబు నైజమని జగన్ విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా ? లేదా ? అనేది ఆలోచించి మరోసారి తనకు అండగా ఉండాలని ప్రజలు కోరారు సి‌ఎం జగన్. ఇక శాశ్వత భూహక్కు భూరక్ష పథకం గురించి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా భూ కబ్జాలు, భూముల్లో జరిగే మోసాలు తగ్గాయని చాలా పరదర్శకంగా అమలౌతునట్లు జగన్ చెప్పుకొచ్చారు. తొలిదశలో 2 వేల గ్రామాల్లో భూ రికార్డులపై ప్రక్షాళన జరిగిందన్న జగన్.. 7,92,238 మంది రైతులకు భూ హక్కు పత్రాలను అందించినట్లు తెలిపారు. ఇక భూ హక్కు కు సంబంధించి ఇప్పటికే 2000 గ్రామాల్లో సర్వే పూర్తి అయినట్లు చెపుకొచ్చారు. ఇక ఈ మద్య జగన్ చేపడుతున్న ప్రతి కార్యక్రమ సభలో కూడా విపక్ష పార్టీ నేతలపై గట్టిగానే విమర్శలు గుప్పిస్తూ.. తమ ప్రభుత్వంలో జరిగిన మంచిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో కూడా ఆశీర్వధించాలని జగన్ కోరుతుండడంతో.. ఇప్పటి నుంచే జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పవన్ పై బీజేపీ ప్రయోగించిన మంత్రం ఏంటి?

పవనే కరెక్ట్.. నేను కాదు: చిరంజీవి!

జాగ్రత్త.. ప్రమాదంలో కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి హెచ్చరిక!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -