Saturday, May 18, 2024
- Advertisement -

సినిమా విడుద‌ల‌కు ముందు వ‌చ్చే ట్రైల‌ర్ లాంటిది…బాబుపై ప‌వ‌న్ సెటైర్లు

- Advertisement -

కాంగ్రెస్‌తో టీడీపీ క‌ల‌వ‌డంపై పొత్తుపై జ‌గ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దాహానికి ఇదొక నిదర్శనమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం వల్లే సమీకరణాలు మారతాయే తప్పపార్టీల కలయికల వల్ల కాదన్నారు. గురువారం ఢిల్లీలో చంద్రబాబు చూపించింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిదని సెటైర్లు వేశారు.

చంద్ర‌బాబు సినిమా ప్లాప్ అవ‌డం ఖాయం అన్నారు. బాబు రాజ‌కీయ జీవితం ఎక్క‌డైతే మొద‌ల‌య్యిందో అక్క‌డికే చేరుకున్న‌ట్లు ఉంద‌ని ఎద్దేవ చేశారు. చంద్రబాబు ఈ నిర్ణయం 2014లో తీసుకోవాల్సిందని సూచించారు. అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ… రాష్ట్రం కోసం తాను టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికే తాను యాత్రలు చేస్తున్నానని… అధికారం కోసం కాదని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -