Sunday, May 19, 2024
- Advertisement -

ముగిసిన నిందితుడి శ్రీనివాస్ క‌ష్ట‌డీ..9 వ‌ర‌కూ జుడ్యూషియ‌ల్ రిమాండ్‌

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ క‌ష్ట‌డీ ముగిసింది. విశాఖ ప‌ట్నం ఏయిర్ పోర్టులో క‌త్తితో దాడి త‌ర్వాత నిందుతున్ని కోర్టులో హాజ‌రు ప‌రిచిన విష‌యం తెలిసిందే. అనంత‌రం మూడు రోజుల పాటు క‌ష్ట‌డీకీ తీసుకున్న శ్రీనివాస్ ను ఈ రోజు కోర్టుకు హ‌జ‌రు ప‌రిచారు.

మూడు రోజులుగా శ్రీనివాస్‌ను సిట్ విచారించారు. అయితే విచార‌ణ‌లో నిజాలు బ‌య‌ట‌కు రాలేద‌ని తెలిసింది. నిందితుడి కాల్ డేటా ఆధారంగా విచార‌ణ జ‌రిపిన పోలీసులు ప‌ల‌వురిని విచారించారు. ఇవాళ అతడి కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు కోర్టుకు తరలించారు

మొదట శ్రీనివాస్ రావుకు ఎయిర్ పోర్టు పీఎస్‌లోనే డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడి ఆరోగ్యం మెరుగ్గానే ఉండటంతో కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద ఎలాంటి అలజడి, గందరగోళం లేకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.

అయితే కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ పొడిగించింది. దీంతో అతన్ని పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. విశాఖ‌ప‌ట్నంలోని అడ‌వివ‌రం సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఈ కేసులో శ్రీనివాస్ ను ఇంకా విచారించాలని సిట్ భావిస్తోంది. అందుకోసం అతన్ని మరోసారి కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌లో దాడికి ఎవ‌రు సూత్ర‌దారులు, దానికి వెనుక ఎవ‌రున్నారు అన్ని నిజాల‌ను ర‌బ‌ట్ట‌డంలో సిట్ అధికార‌లు విఫ‌ల‌మ‌య్యారు.

అందుకోసం అతన్ని మరోసారి కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరనున్నారు. ఇందుకోసం కోర్టులో దాఖలు చేయడానికి సిట్ మరో పిటిషన్ ను సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -