ఏ రాజకీయ నాయకుడైన.. ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో పథకాలను, లెక్కకు మించిన హామీలుగా ప్రకటిస్తూ ఉంటారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత చాలా మంది నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం. అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ప్రజలు గుర్తుంచుకోవాలంటే.. పథకాల పేరుతో ప్రజలకు దగ్గరవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని పథకాల వల్ల ప్రజలకు పెద్దగా ఉపయోగం లేనప్పటికి.. పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ..రాష్ట్ర ఖజానా ను ఖాళీ చేస్తూ ఉంటారు.
ఉదాహరణకు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ని చెప్పుకోవచ్చు. ఎన్నో పథకాల ద్వారా ప్రజల ఖాతాలలో ఉచితంగా నగదు జమ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఉచితంగా డబ్బులు వేయడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదని, అభివృద్ది కనబడదని తెలిసినప్పటికి జగన్ మాత్రం ఉచిత పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు. ప్రజలకు ఉపయోగ పడే ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం తప్పు కానప్పటికి, ఉచితల పేరుతో రాష్ట్ర ఖజానను లూటీ చేయడం శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఇదే విషయమై ఇటీవల ప్రధాని నరేంద్ర మోడి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్దికి ఎంతో ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
అయితే ప్రధాని మోడి చేసిన వ్యాఖ్యలను డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పథకాలు అనగా.. విద్యార్థులకు ఉచిత విద్యా, ప్రజలకు ఉచిత వైద్య సదుపాయం వంటివి కల్పించడం ఏ మాత్రం తప్పుకాదని కేజ్రివాల్ అన్నారు. అయితే మోడి చేసిన వ్యాఖ్యలు ఒకవిధంగా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తించే అవకాశం ఉంది. ఏపీ సిఎం వైఎస్ జగన్ ఉచితల పేరుతో రాష్ట్ర ఖజానా ను ఏ స్థాయిలో వృధా చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వైపు కేంద్రానికి దగ్గరవ్వలని చూస్తున్న వైఎస్ జగన్ కు తాజాగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైఎస్ జగన్ కు కూడా తగిలే అవకాశం ఉంది. ప్రధాని వ్యాఖ్యలపై వైసీపీ వారు స్పందిస్తారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి