Wednesday, April 24, 2024
- Advertisement -

మద్యపాన ఆదాయంపై.. జగన్ చూపు ?

- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటాయి. మూడు రాజధానుల విషయంలో గాని, సంపూర్ణ మద్యపాన నిషేధంలో గాని, ఇంకా చాలా విషయాలలో సి‌ఎం జగన్ పై ఇప్పటికీ కూడా వ్యతిరేకత వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా సంపూర్ణ మద్యపాన నిషేదం ఖాయమని ఎన్నికల ముందు కుండ బద్దలు కొట్టిన జగన్, ఎన్నికల తరువాత ఆ హామీని వెల్లమెల్లగా కనుమరుగు చేశారు. మొదట్లో దశల వారీగా మద్యపాన నిషేదం చేస్తామని ప్రకటించి, మద్యం రేట్లు విపరీతంగా పెంచారు.. అయినప్పటికి మద్యాన్ని ప్రజలనుంచి దూరం చేయలేకపోయారు. .

ఇక ఆ తరువాత స్వయంగా ప్రభుత్వమే మధ్యాన్ని అమ్మే విధంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించి సరికొత్త విధానాలను ప్రవేశపెట్టింది జగన్ సర్కార్.. అయినప్పటికి సి‌ఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మద్యాన్ని ప్రజలకు మరింత చేరువచేసే విధంగా ఉన్నాయే తప్పా.. దూరం చేసే విధంగా లేవనే విమర్శలు కూడా వినిపించాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ఆధాయంలో మద్యం నుంచి వచ్చే వాటానే ఎక్కువగా ఉంటుంది. దాంతో మద్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్న రాష్ట్ర ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించిన జగన్ సర్కార్ సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ని పూర్తిగా పక్కన పెట్టేసి.. తిరిగి పాత విధానంలో అమ్మకాలను యదావిధిగా ప్రారంభించారు.

ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో ఖజానా నిల్వలు పెంచేందుకు.. ప్రభుత్వ అధీనంలో ఉన్న మద్యం దుకాణాలను తిరిగి ప్రయివేటీకరణ చేసే విధంగా సి‌ఎం జగన్ ప్రణాళికలు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధానంగా మద్యం పాలసీలపైనే చర్చించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అప్పుల్లో తగ్గేదెలే.. అంటున్న జగన్ సర్కార్ !

పిల్లల విషయంలో.. జగన్ తప్పుచేస్తున్నారా ?

జగన్నాటకం.. అంతా నాఇష్టం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -