Thursday, April 25, 2024
- Advertisement -

బీజేపీకి టాటా.. ఈటెల చుట్టూ రాజకీయం ?

- Advertisement -

ఈటెల రాజేందర్ ఒకప్పుడు టి‌ఆర్‌ఎస్ లో సీనియర్ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది కే‌సి‌ఆర్ తో విభేదాల కారణంగా ఈటెల టి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ గూటిలో వాలిపోయాడు. ఆ తరువాత జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ కు షాక్ ఇస్తూ బీజేపీ తరుపున ఈటెల ఘనవిజయాన్ని నమోదు చేస్శాడు. ఈ విజయంతో ఒక్కసరిగా ఈటెల స్థానం బిజెపిలో మరింత పెరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఈటెలకు బీజేపీ లో సరైన ప్రాధాన్యం దక్కలేదనే చెప్పాలి. ఒకానొక టైంలో కే‌సి‌ఆర్ కు ప్రత్యర్థిగా బీజేపీ తరుపున ఈటెల సి‌ఎం అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. .

అయితే తెలంగాణలో బీజేపీ తరుపున బండి సంజయ్ యాక్టివ్ గా ఉండడం.. ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడంతో, బండి సంజయ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది బీజేపీ అధిష్టానం. దాంతో బీజేపీ తరుపున చక్రం తిప్పాలని భావించిన ఈటెలకు మోడి చేయి చూపించింది కాషాయ పార్టీ. అయితే ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో భాగంగా ఈటెలను చేరికల కమిటీ చైర్మెన్ గా నియమించింది కమలదళం. అయితే ఈ పదవి పై కూడా ఈటెల అసంతృప్తిగానే ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ లో సరైన ప్రాధాన్యం దక్కనందున ఈటెల పార్టీ మారతాడనే ఊహాగానాలు కూడా బాగానే పెరిగిపోయాయి.

ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మణికం ఠాకూర్ మరియు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వంటి వారు ఈటెల తో రహస్య మంతనాలు చేస్తున్నారని వినికిడి. ఇదిలా ఉండగా టి‌ఆర్‌ఎస్ కూడా ఈటెలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆసక్తి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై మంత్రి కే‌టి‌ఆర్ స్పందిస్తూ.. ” ఈటెల ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం అనేది ఊహాజనితమే “. అని స్పష్టం చేశారు… దీంతో ఈటెల తిరిగి టి‌ఆర్‌ఎస్ లోకి అనే వార్తలకు తెర పడినట్లైంది. కానీ ఈటెలకు సరైన ప్రాధాన్యం దక్కనందున బీజేపీ పట్ల అసహనంగా ఉన్నాడనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈటెల నిజంగానే బీజేపీ కి గుడ్ బై చెప్తాడా ? లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

జగన్ మద్యం దందా .. సరికొత్తగా !

తండ్రి అలా .. కొడుకు ఇలా !

అప్పుల్లో తగ్గేదెలే.. అంటున్న జగన్ సర్కార్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -