పతనమైన రూపాయి.. దేనికి సంకేతం !

- Advertisement -

దేశంలో ప్రస్తుతం రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఎంతలా పడిపోయిందంటే దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో డాలర్ తో పోలిస్తే 80 రూపాయలకు చేరుకుంది. అంటే ఎనబై రూపాయలు ఈక్వల్ టూ ఒక్క అమెరికన్ డాలర్. గతంలో ఎప్పుడు కూడా రూపాయి విలువ ఇంత దారుణంగా పడిపోలేదు. రూపాయి పతనంతో భారత్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పతనం అయిన శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాల జాబితాలోకి మనదేశం కూడా చేరబోతోందా ? అనే అనుమానాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. రూపాయి పతనంతో ప్రజలపై మరింత భారం పడే అవకాశం లేకపోలేదు. .

సామాన్యుడికి అవసరమేయ్యే ప్రతి వస్తువుపై కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రూపాయి ఎంత క్షీణిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంతా దిగజారే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనదేశం ఎక్కువగా ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడుతోంది. ఆ దిగుమతులకు చెల్లించాల్సిన మెత్తన్ని డాలర్ రూపంలో చెల్లించాలి.. దాంతో రూపాయి క్షీణత కారణంగా ద్రవ్యోల్బణం పెరిగి చివరకు అవసరమేయ్యే వస్తువులను దిగుమతి చేసుకునేందుకు కూడా విదేశీ కరెన్సీ నిల్వలు లేని పరిస్థితులు ఏర్పడతాయి. దాంతో ప్రజలపై పెను భారం తప్పదు. ఈ ఏడాదిలో ఇప్పటికే రూపాయి విలువ చాలా సార్లు తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 26 సార్లు పతనమైంది. ప్రతుత్తం డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79.62 వద్ద ఉంది.. ఇదిలాగే కొనసాగితే రూపాయి మారకం విలువ 82 కు కూడా చేరుకునే అవకాశం ఉండని నిపుణులు చెబుతున్నారు.

మరి రూపాయి విలువ మరింత క్షీణించకుండా మోడి ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే రిజర్వు బ్యాంక్ రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు వీలుగా పలు బ్యాంకులపై ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెన్సీ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా రూపాయి విలువను తిరిగి గాడిలో పెట్టేందుకు మళ్ళీ నిత్యవసర ధరల మోత మోగించడం ఖాయమే. ఏది ఏమైనప్పటికి రూపాయి విలువ ఇంత దారుణంగా పడిపోవడం చూస్తుంటే.. మనదేశ ఆర్థిక వ్యవస్థ కూడా శ్రీలంక దేశం మాదిరి అస్తవ్యస్తంగా మారడం ఖాయమనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

శ్రీలంక పరిస్థితి.. భారత్ లో తలెత్తనుందా ?

పార్లమెంట్ పై జాతీయ చిహ్నం.. మోడి పై విమర్శలు!

మోడి పాలనలో దేశం వెనుకడుగు.. ఆధారాలతో ?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -