Thursday, May 8, 2025
- Advertisement -

వైసీపీ నేత‌ల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు…

- Advertisement -

అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీనేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను కాజా టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్‌ను తరలించేందుకు యత్నిస్తున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. గురజాల వెళ్లెందుకు అనుమతి లేదని ఆయనను నిరాకరించారు.

గుంటూరు జిల్లా అంతా పోలీస్‌ నిర్భందంలో ఉందని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, టీడీపీ ప్రభుత్వంలో కోర్టు, చట్టం, రాజ్యాంగమంటూ లేవంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి నిర్భంద పరిస్థితిని ఎన్నడూ చూడలేదని అన్నారు

వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని, ఎమ్మెల్యే డా.గోపి తదితరుల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తామని వైసీసీ నిజనిర్ధారణ కమిటీ ప్రకటించింది.

తమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై కాసు మహేశ్ రెడ్డి మండిపడ్డారు. యరపతినేని అధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారాలు బయటకు వస్తాయనే తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. యరపతినేని అవినీతిలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కు వాటా ఉందని నరసారావు పేట ఎమ్మెల్యే డా.గోపి రెడ్డి మాట్లాడుతూ. తెలిపారు. గత నాలుగేళ్లుగా గుంటూరులో అక్రమ మైనింగ్ యధేచ్ఛగా సాగుతోందని విమర్శించారు. టీడీపీ నేతలు చివరికి రైతులపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమ మైనింగ్ విషయంలో ఈ ఏడాది జూలై 25న మాజీ ఎమ్మెల్సీ టీజీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రైవేట్ భూములలో అనుమతులు లేకుండా 300కోట్లు విలువైన 28లక్షల టన్నుల లైమ్ స్టోన్ ను తరలించినట్లు పిటీషన్లో పిల్ లో ఆరోపించారు. ఈ అంశంపై ఆగష్టు24న ఏపీ ప్రభుత్వం తమ వాదనలను వినిపించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -