Tuesday, May 21, 2024
- Advertisement -

‘రాజకీయ వ్యభిచారి’ చంద్రబాబుకు ఎవరైనా ఎందుకు సహకరించాలి?

- Advertisement -

40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే పూనకం వచ్చినట్టుగా ఏవేవో కథలు చెప్పుకుంటూ పోతాడు. రాజకీయాల్లో మంచి మార్పులు, విలువలు అన్నీ చంద్రబాబే తెచ్చినట్టుగా చెప్తాడు. ఎన్టీఆర్ కూడా చంద్రబాబుకంటే తక్కువ అన్నట్టుగా చెప్తాడు. చంద్రబాబును గొప్పవాడిగా చూపించేందుకు…..ప్రజలను నమ్మించేందుకు పచ్చమీడియా మొత్తం నానా పాట్లూ పడుతూ ఉంటుంది. ఇక నారావారి సొంత భజన గురించి చెప్పనవసరం లేదు.

కానీ ప్రజల కంటికి కనిపిస్తున్న కొన్ని నిజాలు మాత్రం చంద్రబాబును రాజకీయ వ్యభిచారిగా, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను బలిపెడుతున్న వ్యక్తిగానే చూపిస్తున్నాయి. ఏ విషయంపైన అయినా నిజాయితీగా స్పందించే పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఇదే విషయంపై చంద్రబాబుని ప్రశ్నించాడు. 2004 తర్వాత బిజెపితో పొత్తును తెంచుకున్న చంద్రబాబు……..మళ్ళీ జన్మలో బిజెపితో కలవను అని ముస్లిములకు, ప్రజలకు మాట ఇచ్చాడు. కానీ తన అధికార స్వార్థం కోసం 2014లో మోడీకి జై అన్నాడు. విభజనలో సమాన భాగం ఉన్న బిజెపికి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల చేత ఓట్లేయించాడు. మోడీ ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబే దొంగనాటకాలు ఆడాడన్నది నిజం. హోదా గురించి మోడీ ఏనాడైనా ఏమైనా చెప్పాడా? వ్యతిరేకంగా కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ చంద్రబాబు మాత్రం హోదా వేస్ట్ అని ఎన్నిసార్లు అన్నాడో. ఇక తాను ఇచ్చిన రైతురుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం అన్న హామీ అయితే పచ్చి అబద్ధం. ఇక ఇప్పుడు సినిమా వాళ్ళందరూ హోదా ఉద్యమానికి సహకరించాలి…….లేకపోతే చవటలు, దద్దమ్మలు అంటున్న టిడిపి నాయకులు గతం మరిచిపోయారా? హోదా కోసం ఉద్యమించడానికి వచ్చిన సినిమావాళ్ళను లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు. జగన్‌ని కూడా అరెస్ట్ చేయించాడు. యువత అందరినీ పరుగెత్తించి పరుగెత్తించి కొట్టించాడు. ఆ రోజు చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా రావడం ఇష్టం లేదు కాబట్టి అలా చేశాడు. ఈ రోజు 2019 ఎన్నికల కోసం మళ్ళీ హోదా పాట పాడుతున్నాడు. సినిమా వాళ్ళు నాకు సహకరించడం లేదు అని అంటున్నాడు. అసలు ఎలా సహకరిస్తారు? బాబు రాజకీయ స్వార్థం, అధికార స్వార్థంతో ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనానికి సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో నీచమైన రాజకీయాలు చేస్తూ ఉంటే…….జనాలందరూ కూడా బుద్ధీ, జ్ఙానం లేనివాళ్ళులాగా బాబు అధికార స్వార్థానికి తలూపుతూ కూర్చోవాలా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? ప్రత్యేక హోదాకు కొంతమంది సహకరించడం లేదని నిందించే అర్హత బాబుకు ఉందా? అలా ఉండాలంటే తన స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్యాకేజ్‌ల కోసం హోదా విషయంలో నాలుగేళ్ళుగా రాజకీయం చేసినందుకు చంద్రబాబు తనను తాను ఏ స్థాయిలో తిట్టుకోవాలి? పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అబద్ధాలతో నమ్మించి అధికారంలోకి వచ్చి…….అదే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాజకీయం చేసినందుకు ఏ మాత్రం మనస్సాక్షి ఉన్నా చంద్రబాబు తనను తాను ఏ స్థాయిలో విమర్శించుకోవాలి?

అధికార స్వార్థంతో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచీ ప్రజలకు ద్రోహం చేసిన ప్రతిసారీ తనను తాను సమర్థించుకోవడమే తప్ప…….తాను చేసిన రాజకీయాల గురించి చంద్రబాబు ఏనాడైనా నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకున్నాడా? తన డప్పు తాను కొట్టుకోవడం మానేసి కాస్త నిజాయితీగా ఆలోచిస్తే పోసాని మాటలలోని ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి ఆవేదన అన్న విషయం బాబుకు అర్థమవుతుంది. కాకపోతే నిజాయితీగా ఆలోచించడం, నిజాలు చెప్పడం చంద్రబాబు డిక్షనరీలో ఉందా అన్నదే డౌట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -