Monday, April 29, 2024
- Advertisement -

రక్షణ మంత్రి నోట.. ‘పుష్ఫ’డైలాగ్

- Advertisement -

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ సినిమాలోని డైలాగ్ లను , డ్యాన్సులను ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు, సెలబ్రిటీలు మరింత పాపులర్ చేశారు. తాజాగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పుష్ప సినిమాలోని డైలాగ్ న ఎన్నికల ప్రచారంలో చెప్పి ఆకట్టుకున్నారు.

గంగోలి హాట్ లోని ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్ నాథ్ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. పుష్కర్ సింగ్ దామి చాలా హుందాగా, సాదాసీదాగా ఉంటే మనిషి అని.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప డైలాగ్ ను ఉటంకించారు.

‘నేను కాంగ్రెస్ పార్టీ వారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా షుష్కర్ చాలా సౌమ్యుడు. పుష్కర్ అంటే ఫ్లవర్ అని అర్థం. కానీ ఆయన ఫ్లవర్ కాదని ఫైర్ .. నిప్పు లాంటి మనిషి’ రాజ్ నాథ్ చెప్పారు. పుష్కర్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి ఎలాగైనా మరోసారి తిరిగి అధికారంలోకి రావాలని ఆపార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను సైతం ఆపార్టీ తమ అంబాసిడర్ గా ఇటీవల నియమించుకుంది. త్వరలోనే అక్షయ్ కుమార్ బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -