Tuesday, April 23, 2024
- Advertisement -

తెలంగాణలో ఒంటరైన బీజీపీ.. ప్రతిపక్షాల ముప్పేటదాడి

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన తీరును తప్పుబడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో తీవ్రంగా ఫైరయ్యారు. అధికార గర్వంతో కళ్లు మూసుకుపోయి అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించిందని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ తలుపులు మూసి పిప్పర్ స్ప్రేలు వాడి విభజించన తీరుతో నేటికీ ఇరు రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని అన్నారు.

కాగా ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణలో ప్రస్తుతం తీవ్ర దుమారం చేలరేగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రధాని వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోశాయి. ప్రధాని వ్యాఖ్యలను ఎండగట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

టీఆర్ ఎస్ పార్టీలోని మరో కీలక నేత హరీష్ సైతం ప్రధానిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ గుజరాత్ ను మించిపోవడం చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వాడవాడలా ప్రధాని దిష్టి బొమ్మ దహనానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడు మంచి ఊపుమీదుంది. ఇటీవల హుజూరాబాద్ విజయంతో క్యాడర్ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలపై బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ప్రతిపక్షాలకు తామే అస్త్రాన్ని అందించినట్టు అయిందని ఆపార్టీలో అంతర్మథనం మొదలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -