Wednesday, May 15, 2024
- Advertisement -

ఈ సారి టీడీపీ ప‌ప్పులు ఉడ‌క‌లేదు…

- Advertisement -

టీడీపీ కంచుకోట‌లో ఆ పార్టీకి పెద్ద షాక్ త‌గిలింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మునిసిపల్‌ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్సీపీ సొంతమయ్యింది. ఎన్ని కుట్ర‌లు చేసినా చివ‌రికి టీడీపీ ప‌రువు పోగొట్టుకుంది. ర్మన్‌ ఎంపిక విషయమై గత కొద్ది రోజులుగా రసవత్తర రాజకీయం నడిచింది. త‌మ‌కు బ‌లం లేక‌పోయినా నిస్సిగ్గు రాజ‌కీయాల‌కు మ‌రో సారి తెర‌లేపింది అధికార ప‌ర్టీ.

అధికారంలోఉన్నా మ‌న్న అహంకారంతో విధ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఏ తరహా నికృష్ట రాజకీయాలకు తెరలేపిందో, ఇక్కడా అదే నికృష్ట రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ 10 సీట్లు గెల్చుకోగా, వైఎస్సార్సీపీకి 16 సీట్లు దక్కాయి. ఒకటి ఇతరుల ఖాతాలోకి వెళ్ళింది. ఆ లెక్కన, ఎలాంటి గందరగోళం లేకుండానే జగయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్సీపీకి దక్కాలి. నిన్ననే ఛైర్మన్‌ ఎంపిక జరగాల్సి వుండగా, టీడీపీ విధ్వంసం సృష్టించడంతో ఛైర్మన్‌ ఎంపిక నేటికి వాయిదా పడింది.

ఛైర్మన్‌ ఎంపిక వ్యవహారంపై టీడీపీ నానా యాగీ చేసింది. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ కిడ్నాప్‌ చేసిందంటూ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. అయితే, ఛైర్మన్‌ ఎంపికకు కావాల్సిన మెజార్టీ వున్న వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్లను ఎందుకు కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌నేది ఇక్క‌డ ఆలోచించాలి.

ఛైర్మెన్ వ్య‌వ‌హ‌రంలో అధికార‌పార్టీ ఎంత యాగీ చేసినా చివ‌ర‌కు షాక్ త‌ప్ప‌లేదు. జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఇంటూరి రాజగోపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ పంతం నెగ్గలేదన్న అక్కసుతో ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియ నుంచి టీడీపీ వాకౌట్‌ చేసింది. పరువు పోగొట్టుకున్న టీడీపీ, ఎన్నికల నిర్వహణాధికారిపై ఆరోపణలు చేయ‌డం కొస‌మెరుపు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -