Friday, May 3, 2024
- Advertisement -

కేటీఆర్ పిట్టలదొర కబుర్లకేం తక్కువ లేదు

- Advertisement -

ఏందిరయ్యా ? నీ పిట్టలదొరల కబుర్లు ? అయ్యను మించిపోయి మరీ కోతలు కోస్తున్నావే..! టీఆర్ఎస్ ను ఆంధ్రాలో పోటీ చేయమని జనం కోరుతున్నారా ? ఇంకానయం అమెరికాలోనూ పోటీ చేయమని కోరుతున్నారని చెప్పావు కాదు. ఏపీలో పోటీ చేయాలంటూ… రోజూ లక్షల కొద్దీ ఫోన్లు చేస్తున్నారు. రేపోమాపో ఏపీలో ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు, ఆత్మహత్యయత్నాలు కూడా చేసేస్తారేమో…అని చెప్పావు కాదు. నిరాహారదీక్షల కోసం శిబిరాలు కూడా ఏర్పాటు చేసేస్తున్నారని కోతలు కోసేయలేదు. కేసీఆర్ కంటే నాలుగు ఆకులే చదివావు కదా కేటీఆర్… పైగా కేసీఆర్ చదువు ఆంధ్రాలో సాగితే, తమరు అమెరికాలో వెలగబెట్టారు కదా…ఆ మాత్రం కోతలు ఉండటం సహజమేలే. కానీ మరీ ఇలా పిట్టలదొరల్లా కబుర్లు చెప్పి నవ్వులపాలు కాకునాయనా .! అని నెటిజన్లు కేటీఆర్ ను ఉతికి ఆరేస్తున్నారు. ‘కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి. అని ఆంధ్రాలో కోరుకుంటున్నారు’. అని కేటీఆర్ షాద్ నగర్ లో చెప్పుకొచ్చాడు. వెనకటికొకడు మా ఊరి మిరియాలు తాటికాయలంత అని చెప్పుకున్నాడట. అలా చెప్పుకున్నోడు బహూషా కేటీఆర్ కాదు కదా…! అనే అనుమానం కూడా ఇప్పుడు చాలామందికి కలుగుతోంది.

పైగా ఈ మధ్య ఓ సెటైర్ కేసీఆర్ మీద సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

మొన్న: తెలంగాణపై ఈ ఆంధ్రోళ్ల పెత్తనం ఏంది ? నన్ను తెలంగాణ సీఎంను చేయండి అన్నాడు
నిన్న: దేశం మీద నరేంద్రమోడీ పెత్తనం ఏంది ? నన్ను ప్రధానిని చేయండి అన్నాడు
రేపు : ప్రపంచం మీద అమెరికా పెత్తనం ఏంది ? నన్ను ప్రపంచానికే అధ్యక్షుడుని చేయండి అంటాడు
ఎల్లుండి : అసలు ఈ మనుషుల మీద దేవుడి పెత్తనం ఏంది ? నన్ను దేవుడుని చేయండి అని అంటాడు

ఇప్పుడు ఈ సెటైర్ ను నిజం చేసేయాలని కేటీఆర్ పూనుకున్నాడా ? ఏంటి ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నేడు ఆంధ్రాలో టీఆర్ఎస్ పోటీ చేయాలని కోరుతున్నారని చెప్పాడు. రేపు ఇండియా అంతటా కోరుతున్నారని, ఎల్లుండి అమెరికాలోనూ కోరుతున్నారని చెబుతాడేమో…! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రశ్నలతో పాటు సోషల్ మీడియాలో 45 ప్రశ్నలతో కూడిన ఓ నిలదీత తెగ వైరల్ అయిపోతోంది. ఆ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పుకోకుండా, ఈ కోతలేంటో ?

దేనికోసం ప్రగతి నివేదన సభ ?

1.దళితుడిని ముఖ్యమంత్రి చేసినందుకా.?
2.ముస్లిం, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇచ్చినందుకా..?
3.అందరికీ డబుల్ బెడ్ రూంలు ఇచ్చినందుకా..?
4.దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినందుకా..?
5.రైతులకు రుణమాఫీ చేసాడనా..?
6.ఇంటింటికీ కుళాయి నీరు ఇచ్చాడనా..?
7.ప్రతి నియోజకవర్గాని లక్ష ఎకరాల చొప్పున నీరు ఇచ్చాడనా..?
8.ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాడనా..?
9.కేజీ నుండి పీజీ వరకు నిర్భంధ విద్య ఇచ్చాడనా..?
10.నియోజకవర్గంకి ఒక 100 పడకల హాస్పిటల్ కట్టినందుకా..?
11.జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినందుకా..?
12.మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ పెట్టినందుకా..?
13.హైదరాబాద్ లో ఆకాశ హర్మ్యాలు కట్టినందుకా..?
14.హుస్సేన్ సాగర్ శుద్ధి చేసినందుకా..?
15.వరంగల్ లో మురికివాడలు లేకుండా చేసినందుకా..?
16.భద్రాచలంలో రామాలయం 100 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పినందుకా..?
17.కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసినందుకా..?
18.సింగరేణిలో కారుణ్య నియకాలను వారసత్వ ఉద్యోగాలుగా మార్చినందుకా..?
19.ప్రాజెక్టుల నిండుగా నీరు ఉన్నా నీటి పంపకం రానందుకా..?
20.ధర్నా చౌక్ తీసివేసినందుకా..?
21.ఉస్మానియా యూనివర్సిటీని అబివృద్ధి చేసినందుకా..?
22.ఉద్యమకారులను గుర్తించి వారి కుటుంబాలకు న్యాయం చేసినందుకా..?
23.మంత్రి వర్గంలో మహిళలకు సమన్యాయం చేసినందుకా..?
24.రైతు ఆత్మహత్యలు ఆగనందుకా..?
25.చేనేత కార్మికుల బ్రతుకులు బాగుపడ్డందుకా..?
26.నేరెళ్లలో దళితులకు పోలీసుల దెబ్బల కోసమా..?
27.ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినందుకా..?
28.నిజాం సుగర్స్ తెరిచినందుకా..?
29.బయ్యారంలో ఇనుప పరిశ్రమ కట్టినందుకా..?
30.కొత్తగూడెంలో వ్యవసాయ యూనివర్సిటీ ఇచ్చినందుకా..?
31.మొగుడుకి ఇస్తే పెళ్లానికి ఫించన్ ఇవ్వనందుకా..?
32.నకిలీ విత్తనాలు తెలంగాణలో విపరీతంగా దొరుకుతున్నందుకా..?
33.నయీమ్ కేసును మూసేసినందుకా..?
34.డ్రగ్స్ కేసు తెరిచి ఏమీ చేయనందుకా..?
35. నాలాల పైన ఉన్న పెద్దల కట్టడాలను తొలిగించనందునా..?
36.నాచారం భూములను కె కె అనునాయులకు కట్టబెట్టినందుకా..?
37.మహబూబ్ నగర్ లో వలసలు ఆగనందుకా..?
38.గుంతలు లేని హైదరాబాద్ రోడ్డులు వేసినందుకా..?
39.గ్రామజ్యోతితో గ్రామాల రూపు రేఖలు మార్చినందుకా..?
40.పక్క పార్టీల వారిని పార్టీలో కలుపుకున్నందుకా..?
41.రాజ్యాంగ పరిరక్షకుల చేతనే రాజ్యాంగ పరిహాసంగా వేరే పార్టీ శాసనసభ్యులును మంత్రులను చేసినందుకా..?
42.సచివాలయానికి రాకుండా పాలించినందుకా..?
43.ముఖ్యమంత్రిగా జిల్లాలలో పర్యటనలు చేయకుండా జిల్లా రివ్యూలు చేయనందుకా..?
44.భాష భాష అని బూతులు మాట్లాడి తెలంగాణ భాష పరువు తీసినందుకా..?
45.కులానికొక భవనం కడతా అని కట్టనందుకా..?

ఏమి చేశావని ఈ ప్రగతి నివేదన సభ………

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -