Friday, May 3, 2024
- Advertisement -

మేకపాటి, ఆనం, నేదురుమల్లి కుటుంబాలన్నీ వైకాపావైపే……. క్లీన్‌స్వీప్ ఖాయమా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్నా కూడా రాజకీయంగా అమితమైన ప్రభావం చూపగల కుటుంబాలు వంద వరకూ ఉంటాయేమో. ఒక జిల్లాలో ఉన్న ఆ స్థాయి కుటుంబాలు, ఆ నాయకులు మొత్తం ఒకే పార్టీకి మద్దతునిస్తే ఆ జిల్లాలో ఫలితాలు ఎలా ఉంటాయి? ఇప్పటి వరకూ ఏ జిల్లాలోనూ ఏ పార్టీ తరపున కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఎందుకంటే సీట్ల పంపకం విషయంలో అందరికీ న్యాయం చేయడం కష్టం కాబట్టి ప్రముఖ కుటుంబాలన్నీ కూడా వివిధ పార్టీల్లో ఉంటాయి. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం 2019 ఎన్నికల నాటికి అన్ని ప్రముఖ రాజకీయ కుటుంబాలు కూడా వైకాపాలోనే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నెల్లూరు జిల్లా నుంచి ఇప్పటికే మేకపాటి కుటుంబ సభ్యులందరూ వైకాపాలోనే ఉన్నారు. తాజాగా ఆనం కుటుంబీకులు కూడా వైకాపాలో చేరారు. ఇక ఈ నెల ఎనిమిదో తేదీన నేదురుమల్లి రాం కుమార్‌రెడ్డి కూడా వైకాపాలో చేరనున్నాడు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుటుంబీకులు జగన్‌కి మద్దతు పలకనున్నారు. 2014 ఎన్నికల్లో కూడా టిడిపి కంటే వైకాపాకే నెల్లూరులో ఎక్కువ ప్రజాదరణ కనిపించింది. ఈ సారి అన్ని ప్రముఖ రాజకీయ కుటుంబాలూ వైకాపాలోనే ఉండే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా మొత్తాన్ని వైకాపా స్వీప్ చేయడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీట్ల పంపకాల విషయంలో ఆయా కుటుంబాల నేతల మధ్య విభేదాలు రాకుండా వైఎస్ జగన్ మేనేజ్ చేయగలిగాడంటే మాత్రం 2019 ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ వైకాపానే గెలుస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టిడిపి నుంచి ప్రముఖ నాయకుడిగా ఉన్న మంత్రి నారాయణకు క్షేత్ర స్థాయిలో కనీస స్థాయి పట్టు కూడా లేదని……..ఈ నేపథ్యంలో మేకపాటి, ఆనం, నేదరుమల్లి కుటుంబాలన్నీ వైకాపా గెలుపు కోసం కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని సీట్లలోనూ వైకాపా గెలుపు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -