Monday, May 5, 2025
- Advertisement -

రెండుగంట‌ల పాటు ఉత్కంఠ‌..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక నామినేష‌న్ల ప‌రిశీల‌న చివ‌రిరోజు కావ‌డంతో ఇరు పార్టీలు డ్రామాకు తెర‌లేపారు.అస‌లు ఏంజ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ కొన‌సాగింది.నామినేష‌న్ల ప‌త్రాల‌ల్లో త‌ప్పులున్నాయ‌ని ఇరు పార్టీ నేత‌లు ప‌ర‌స్ప‌రం ఈసీక‌కి పిర్యాదు చేసుకోవ‌డంతో ఆందోళ‌న నెల‌కొంది.వీరి నామినేష‌న్లు తిర‌స్క‌ర‌న‌కు గుర‌య్యాయ‌నె వార్త‌లు వెలువ‌డ్డాయి.

అయితె ఈ ఉత్కంఠ‌కు తెర దింపింది ఈసీ.నంద్యాల అసెంబ్లీ స్థానంలో బరిలో ఉన్న టిడిపి, వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను సక్రమమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.ఇరువర్గాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట తమ వాదనలు విన్పించారు. రెండు వర్గాలు ఆర్‌డిఓ కార్యాలయం వద్ద భారీగా మోహరించాయి. అయితే ఏం జరుగుతోందోనననే ఉత్కంఠ నెలకొంది. అయితే రెండు వర్గాల వాదనలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్లు సక్రమమేనని తేల్చి చెప్పారు.

అయితే, సాయంత్ర 6 గంటల ప్రాంతంలో శిల్పా నామినేషన్ చెల్లుతుందని ఎన్నికల సంఘం చేసిన ప్రకటనతో వైసీపీ వర్గాల్లో టెన్షన్ తగ్గింది. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన నోటరి రెన్యువల్ కాలేదన్న విషయంలో అసలు సమస్యే కాదంటూ తేల్చేసింది. దాంతో శిల్పా నామినేషన్ పై టిడిపి చేసిన ఫిర్యాదుతో పసలేదని తేలిపోయింది. ఇక, భూమా నామినేషన్ పై వైసీపీ చేసిన ఫిర్యాదును కూడా ఎన్నికల సంఘ కొట్టేసింది.ఇక రెండు పార్టీలు ఎన్నిక‌ల పోరులో ముమ్మ‌రంగా త‌ల‌ప‌డ‌నున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -