Sunday, May 5, 2024
- Advertisement -

బోయపాటి మార్క్ మాస్ మసాలా…… సుకుమార్ స్టైల్‌లో…. రంగస్థలం ట్రైలర్ రివ్యూ

- Advertisement -

జగపతి బాబు, ఆది…..ఇంకా చిన్నా చితక విలన్స్ చాలా మంది. సీన్ ఏదైనా కూడా భయంకరమైన యాక్షన్ ఎపిసోడ్‌కి లీడ్ సీన్‌లానే అనిపించడం……నాలుగైదు హై ఎండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసి మిగతా కథను ఆ ఫైట్స్‌కి తగ్గట్టుగా రాసుకోవడం……ఇక ఊర మాస్ ఊరి జనాలు…….నరుకుడులు, కొట్లాటలు……మధ్య మధ్యలో అమ్మాయితో కాస్త మోటు సరసాలు…….ఇవన్నీ బోయపాటి మార్క్ మసాలాలు……..కానీ ఇప్పుడు ఇవే మసాలాలను తన స్టైల్‌లో ప్రజెంట్ చేస్తూ వచ్చాడు సుకుమార్.

రామ్ చరణ్‌లో ఉన్న నటుడిని గొప్పగా ఆవిష్కరించాడు సుకుమార్. అంతవరకూ సుక్కూని ఎంతైనా అభినందించొచ్చు. కమర్షియల్ ఫలితంతో సంబంధం లేకుండా ఈ సినిమా చెర్రీ కెరీర్‌లో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. చరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అని చెప్పొచ్చు. సమంతా కూడా క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది.

ఆ రెండు విషయాలూ పక్కన పెట్టి చూస్తే మాత్రం ట్రైలర్ లో చూపించిన విజువల్స్ అన్నీ కూడా బోయపాటి సినిమాలలో తరచుగా చూసే విజులవల్స్‌లా ఉండడం గమనార్హం. కథ కూడా రొటీన్ కథలానే కనిపిస్తుంది. మేకింగ్‌లో ఎక్కడా కూడా సుకుమార్ మార్క్ క్రియేటివిటీ అయితే కనిపించలేదు. దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బోయపాటి సినిమాల శైలిలోనే సాగింది. ట్రైలర్‌ని బట్టి చూస్తే మాత్రం చరణ్ బెస్ట్ యాక్టింగ్ స్కిల్స్‌ని ప్రజెంట్ చేస్తూ సుకుమార్ తీసిన బోయపాటి మార్క్ మసాలా ఎంటర్టైనర్‌లా రంగస్థలం ఉంది. ఇక సినిమాలో ఏమైనా సుకుమార్ మార్క్ మెరుపులు కనిపిస్తాయేమో చూడాలి మరి. మాస్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను మాత్రం అలరించే స్థాయి సినిమాలానే ఉంది రంగస్థలం. ఆ పైన క్లాసిక్ స్థాయికి, బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుతుందా అంటే మాత్రం సుకుమార్ మార్క్ బ్రిలియన్స్ సినిమాలో చాలానే కనిపించాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -