Monday, April 29, 2024
- Advertisement -

అమ్మా.. సోనియా.. వారి నోరు భలే మూయించావుగా..?

- Advertisement -

గత కొన్ని రోజులుగా నేషనల్ కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా తయారైందో అందరికి తెలిసిందే.. కాంగ్రెస్ లోని ఈ అంతర్గత విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ కి ఎంత నష్టమో ఇతర పార్టీలకు అంతే లాభం..ఎందుకంటే ఈమె చేయకుండానే ప్రతిపక్ష పార్టీ దిగజారిపోతుండడం, ఎలాంటి ఎత్తులు వేయకుండానే కాంగ్రెస్ లాంటి ఘణ చరిత్ర ఉన్న పార్టీ అప్రతిష్టపాలు అవడం బీజేపీ లాంటి పార్టీ కి ఎంతో ప్లస్ పాయింట్ అవుతుంది.. అందుకే బీజేపీ ఎక్కడా కాంగ్రెస్ గురించి నోరు మెదపడంలేదు.. అప్పుడో ఇప్పుడో విమర్శించినా పైపైనే విమర్శిస్తూ చేతులు దులుపుకుంటుంది.. ఇక పార్టీ లో చెలరేగిన అసమ్మతి మంటలకు సోనియా చెక్ పెట్టె విధంగా కార్యాచరణ ప్రారంభించింది అని చెప్పొచ్చు..

ఇప్పటికే అసమ్మతితో లేఖ రాసిన 23 మంది ని పార్టీ ప్రాధాన్యం లేకుండా చేసేవిధంగా అడుగులు వేసింది.. అనుభ‌వం, వాగ్దాటి ఉన్న వీరిని కాద‌ని త‌న‌కు అత్యంత విశ్వాస‌పాత్రుడిగా ఉన్న జైరాం ర‌మేశ్ ను రాజ్య‌స‌భ‌లో చీఫ్ విప్ గా నియ‌మించారు. ఇక పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఓ కమిటీ ని నిర్వహించిన సోనియా గాంధీ ఆ కమిటీ బాధ్యతలను వారిని కాదని వేరే వారికి ఇవ్వడం సర్వత్రా ఆసక్తికరంగా ఉంది.. ఆ క‌మిటీకి ఆమె రాజ‌కీయ స‌ల‌హాదారు కాగా, ఏఐసీసీ కోశాధికారి అహ్మ‌ద్ ప‌టేల్, కేసీ వేణుగోపాల్ స‌భ్యులుగా నియ‌మితుల‌య్యారు. అలాగే లోక్ స‌భ‌లో పార్టీ ఉప‌నేత‌గా గౌర‌వ్ గొగోయ్ ను, విప్ గా ర‌వ‌నీత్ సింగ్ బిట్టూను నియ‌మించారు.

ఇక పార్టీ లోని కొంతమందితో అసమ్మతి తో ఉన్న నేతలపై విమర్శలు గుప్పిస్తూ వారిని హేళన చేసే విధంగా చేస్తుంది.. తాజగా కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్ర‌సాద్ , శశి థరూర్ లపై యూపీ కాంగ్రెస్ లిఖింపురి జిల్లా యూనిట్, కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో ఒక‌రైన‌ సురేష్ చేసిన విమర్శలే దానికి నిదర్శనం.. కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్ర‌సాద్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని యూపీ కాంగ్రెస్ లిఖింపురి జిల్లా యూనిట్ తీర్మానించగా, శశిథరూర్ పై కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో ఒక‌రైన‌ సురేష్ గతంలో ఎప్పుడు లేనివిధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీని ఎలా నడపాలో, పార్టీ పరిధిలోనే పార్లమెంటరీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాలో శిశు థరూర్ కి తెలీదు, ఆయన ప్రతి చర్యా ఆయనలోని అపరిపక్వతే ఉంది, తానేదో గ్లోబల్ సిటిజిన్ అన్నట్టుగా పార్టీకి భిన్నమైన వైఖరిని ప్రదర్శించడం సరికాదు అని విమర్శించాడు.. ఏదైతేనేం అసమ్మతితో ఉన్న నేతలను ఈవిధంగా సోనియా అవమానిస్తుంటే వారు రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా ఉంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -