Tuesday, April 30, 2024
- Advertisement -

సోము వీర్రాజు భలే ప్లాన్ వేశాడే..?

- Advertisement -

వీరావేశంతో వచ్చిన కొన్ని రోజుల్లోనే టపటపా బీజేపీ లో కొంతమంది ని పీకిపారేసి బీజేపీ పెద్ద ఆగ్రహానికి గురైన బీజేపీ నయా అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పుడు మరో విప్లవాత్మక నిర్ణయాలకు పూనుకుంటున్నారు.. ఇది దేనికి దారి తీస్తుందో తెలీదు కానీ బీజేపీ నేతలను సైతం ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో ఆశ్చర్య పరుస్తుంది. ఇప్పటికే ఓ నూతన కమిటీ ఏర్పాటు చేసిన సోము గ‌తంలో మాదిరిగా జంబో క‌మిటీ కాకుండా 25 మందితోనే క‌మిటీ ఉండేలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్ర బీజేపీ సూచించినట్లు ఒకరికి నాయకత్వం ఉన్నవారికి మరో నాయకత్వం అప్పగించవద్దని సూచించినట్లు చేస్తూ యాక్టివ్ గా ఉన్న పలు నేతలకు అవకాశాలు కల్పిస్తూ 2024 నాటికి రాష్ట్రంలో బలమైన పార్టీగా మార్చేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు..

ఇక రాష్ట్రంలోని 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమూలంగా మార్పులు తీసుకొచ్చేటందుకు కసరత్తులు మొదలుపెట్టారు.. పార్లమెంటు స్ధానానికో పదవి ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానానికి కార్యదర్శి లేదా ఉపాధ్యక్షుడిని నియమించబోతున్నారట.. ఇప్పటికే వారి జాబితా కూడా తయారైందట.. వీరిలో పలువురు నేతలు గతంలో కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు లేదా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారే ఉంటారని కూడా తెలుస్తోంది.

ఇందులో ఎలాంటి తారతమ్యం లేకుండా కొత్త , పాత అనే తేడా లేకుండా సీనియర్లు, జూనియర్లు అందరికి సమన బాధ్యత కల్పిస్తూ వారి ఎన్నిక ఉండబోతుంది.. పార్టీ కష్టపడేతత్వం ఉన్నవారికి ప్రాధాన్యం కలిపించినట్లు తెలుస్తుంది. బీజేపీతో జరుగుతున్న మార్పులతో చాలా మంది యువనేతలు యాక్టివ్‌ అయ్యారు. వీరిలో నెహ్రూ యువకేంద్రం వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, యువమోర్చా నేత నాగోతు రమేష్‌ నాయుడు, రావెల కిషోర్‌ బాబు, మధుకర్, తురగా నాగభూషణం, తిరుపతిరావుతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు నేతలకు కూడా అవకాశం దక్కబోతోంది. మరి ఇన్ని మార్పులు మూన్నాళ్ళ ముచ్చటే అవుతాయా. లేదా పార్టీ బలానికి ఉపయోగపడతాయా అనేది చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -