Thursday, May 9, 2024
- Advertisement -

కృష్ణా పుష్కరాల ఘాట్ ల అవినీతిలో దేవినేని ఇరుక్కుంటాడా…?

- Advertisement -

జగన్ అధికారంలోకి రావడమేమో గానీ టీడీపీ వెన్నులో మంత్రం వణుకు పుట్టిస్తున్నాడు.. వరుసగా టీడీపీ నేతల టార్గెట్ తో కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడని వార్తలు వస్తున్నా జగన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే అచ్చెన్నాయుడు తో సహా పలువురు టీడీపీ సీనియర్ నేతలను ఊచలు లెక్క పెట్టిస్తున్న జగన్ టీడీపీ లో మరో బలమైన నాయకుడికి స్పాట్ పెట్టనున్నాడు. ఆయనే బెజవాడ లో అత్యంత కీలకమైననాయకుడిగా ఉన్న దేవినేని ఉమా.. ఆయనకు టీడీపీ లో ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. చంద్రబాబు కు కూడా ఎంతో నమ్మదగ్గ వ్యక్తి అని అంటుంటారు..

చంద్రబాబు కు కుడిభుజంగా ఉంటూ ఆయన బెజవాడ లో చాల అక్రమాలకు పాల్పడ్డారని ఇప్పటికే చాల అభియోగాలు వచ్చాయి. అయితే వాటిని అస్త్రంగా చేసుకుని జగన్ దేవినేని ని జైలుకి పంపే ఆలోచన చేస్తున్నాడట జగన్.. గత కొన్ని రోజులుగా కృష్ణ పుష్కరాల్లో జరిగిన ప్రమాద ఘటన గురించి ఉవ్వెత్తున చర్చ జరుగుతుంది.. దాంతో కృష్ణా పుష్కరాల ఘాట్ ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై విజలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.అచ్చెన్న విషయంలో చేసిన విధంగానే ఈ కేసును విచారించబోతుందట ప్రభుత్వం..

మొదట విజిలెన్సు ను పంపి విచారణ చేసి ఆ తర్వాత టీం ని పంపి అరెస్ట్ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తుందట.. పుష్కర ఘాట్ నిర్మాణ విషయంలో భారీ అవకతవకలు జరిగాయి అని వైసీపీ భావిస్తుండడంతో ఈ కేసు ఇప్పుడు బయటకి వచ్చింది. 2016 ఈ పుష్కర ఘాట్ ప్రమాదం జరగగా, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా పుష్కర్ ఘాట్ లను కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 34 ఔష్కర ఘాట్ లను ఏర్పాటు చేసింది.. టైర్ట్ ఎస్ఈ సుధాకర్ తో పాటు మరో ఇద్దరు ఎస్ఈలు, ఒక ఈఈపై విచారణకు ప్రభుత్వం ఆదేశించగా ఇక్కడ ఇంత సడెన్ గా చేపట్టిన విచారణ కు కారణం దేవినేని ఉమా కు గాలమేయడం అన్నది స్పష్టం గా తెలుస్తుంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -