- Advertisement -

అప్పుడు చిరుపై అలా… ఇప్పుడు పవన్‌పై పిరికిపంద డైలాగ్… రజినీ మెగా టార్గెట్

- Advertisement -

రజినీకాంత్-మోహన్‌బాబుల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు హీరోల మధ్య ఆ స్థాయిలో కుటుంబ బాంధవ్యాలు ఉండడం గొప్ప విషయమే. ఇక మోహన్‌బాబు-చిరంజీవిల ఉప్పు-నిప్పు బంధం గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్య విష్ణు నటించిన డైనమైట్ సినిమాలో అయితే డైరెక్ట్‌గానే చిరును ఉద్ధేశించినట్టుగా డైలాగులు ఉన్నాయని మెగాభిమానులు వాపోయారు.

అంతకు ముందు ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో రజినీ కూడా చిరంజీవి సమక్షంలోనే చిరుపై సెటైర్ వేశాడు. ‘అందరి సినిమాలూ హిట్టవ్వాలనుకునేవాడు హీరో……తన ఒక్కడి సినిమానే ఆడాలి, మిగతా సినిమాలన్నీ పోవాలి అని అనుకునేవాడు విలన్’ అంటూ ఎటాక్ చేశాడు. మోహన్‌బాబు కొడుకుల సినిమాల ఫ్లాప్‌ల విషయంలో మెగా హ్యాండ్ ఉందని మంచువారు అంతర్గతంగా ఆవేధన వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే సినిమాల విషయంలో మెగా కాంపౌండ్ ప్రతినిధి అల్లు అరవింద్ రాజకీయాల గురించి ఎన్నో విమర్శలున్నాయి. అవన్నీ గుర్తుంచుకునే… మోహన్ బాబు ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే రజినీకాంత్ చిరంజీవిపై పంచ్ వేశాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇక ఇప్పుడు తాజాగా రాజకీయ ప్రవేశం గురించి రజినీ మాట్లాడినప్పుడు చెప్పిన ఒక డైలాగ్ డైరెక్ట్‌గా పవన్‌కే తగులుతుంది. ‘రాజకీయ పార్టీ పెట్టాక కూడా పోటీ చేయకుండా ఉండేవాళ్ళు పిరికిపందలు’ అని రజినీ ఓ డైలాగ్ పేల్చాడు. ఈ డైలాగ్‌ని సినిమా, రాజకీయ విశ్లేషకుడు మహేష్ కత్తి వెంటనే అందిపుచ్చుకున్నాడు. రాజకీయ పార్టీ పెట్టి కూడా పోటీ చేయకుండా ప్యాకేజ్ రాజకీయాలు చేస్తున్న పవన్ పిరికిపంద కాదా? రజినీకాంత్ విమర్శ నిజంకాదా అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశాడు. మహేష్ కత్తి విషయం పక్కనపెట్టినా దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీ పెట్టి నాలుగేళ్ళవుతున్నప్పటికీ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని నాయకుడు ఇంకెవరూ లేరు. ఆ విధంగా చూసుకుంటే మాత్రం ‘రాజకీయ పార్టీ పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయలేనివాళ్ళు పిరికిపందలు’ అన్న రజినీ డైలాగ్ డైరెక్ట్‌గా పవన్‌కే తగులుతోంది. పవన్ యాంటీ ఫ్యాన్స్ ఆల్రెడీ ‘పవన్ పిరికిపంద’ అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు కూడా పవన్……..నా దగ్గర డబ్బులు లేవు అని చేతకాని మాటలే చెప్తాడా? మరి డబ్బులు లేవు, పోటీ చేసే స్థాయి లేదు అనుకున్నప్పుడు పార్టీ ఎందుకు పెట్టావు అంటే ఏం సమాధానం చెప్తాడు? అయినా ప్రజల తరపున ప్రశ్నిస్తా…..ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి అధికారంలో ఉన్న వాళ్ళ భజన చేస్తూ ప్రతిపక్ష నాయకుడిని విమర్శిస్తూ టైం పాస్ పాలిటిక్స్, బ్యాక్ గ్రౌండ్ పాలిటిక్స్ చేస్తున్న పవన్‌ ఏనాడైనా……ఏ ప్రశ్నకైనా, విమర్శకైనా సమాధానం చెప్పాడా? ఇప్పుడు కూడా సమాధానం చెప్పే ధైర్యం పవన్ చేస్తాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -