Wednesday, May 15, 2024
- Advertisement -

జగన్‌ని రాక్షసుడని నమ్మించినట్టుగానే మోడీ విషయంలో కూడా చెయ్యగలవా ఆర్కే?

- Advertisement -

‘చూడు…… పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నీ భార్యను చూడు’ అని చంద్రముఖిలో సూపర్ ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాధాకృష్ణలో వస్తున్న మార్పు గురించి కూడా అలానే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల ముందు నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబుతో సహా, బాబు భజన మీడియాలో ప్రముఖుడైన రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్, పచ్చబ్యాచ్‌లో వస్తున్న మార్పు కూడా ఇలానే ఉంది.

2014 ఎన్నికల సమయంలో మోడీని అద్భుతం అని సీమాంధ్రులను నమ్మించింది వీరే. నిజానికి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని 2014 ఎన్నికలకు ముందే సోనియా గాంధీ తీసుకోవడానికి ప్రధాన కారణం బిజెపినే. మీరు ఇస్తారా ఒకే…….లేకపోతే 2014తర్వాత అధికారంలోకి వచ్చిన వెంనటే మేం ఇచ్చేస్తాం అన్నారు. అలాగే చంద్రబాబు కూడా తుపాకీ మా భుజాలపై పెట్టి కాల్చే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి…..తెగ ఆవేశపడిపోయి…. దమ్ముంటే …ఇవ్వాలని ఉంటే తెలంగాణా ఇచ్చెయ్యండి అని రంకెలు వేశాడు. ఇక బిజెపి మద్ధతు లేకుండా రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే అవకాశమే లేని పరిస్థితుల్లో తెలంగాణా ఏర్పాటుకు పూర్తి సహకారం అందించింది బిజెపి పార్టీ. బిల్లుకు అనుకూలంగా మొదటి ఓటు వేసిన ఎంపి తెలుగుదేశం పార్టీ ఎంపినే. అయితేనేం మోడీ-బాబు పొత్తు కుదిరిన పాపానికి విభజన పర్వంలో తన పాపాన్ని కడిగేసుకోవడంతో పాటు బిజెపి పాపాన్ని కూడా సీమాంధ్రు ప్రజలకు తెలినివ్వకుండా మాయచేసింది బాబు భజన మీడియా. ఇక సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ఇంకా అద్భుతంగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ అయితే మేజిక్ చేసి పడేశాడు. హోదా బూచీని చూపించి సీమాంధ్రులను నమ్మించారు. సీమాంధ్రుల దృష్టిలో మోడీని దేవుడిని చేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈనాడు, ఆంద్రజ్యోతిలతో సహా పచ్చ బ్యాచ్ మొత్తం పడిన కష్టం అంతా ఇంతా కాదు. మొత్తానికి సీమాంధ్రులను దారుణమైన మోసపు మాటలతో నమ్మించి అధికరారంలోకి వచ్చారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు, బాబు-మోడీ జోడీ ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారని ఒక్క సారి విచక్షణతో పరిశీలించి చూసినవారికి ఎవరికైనా 2014 ఎన్నికల సమయంలో మోసపు మాటలతో మోసగించారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆంద్రప్రదేశ్‌కి మోడీ ఏమీ చేయకపోయినప్పటికీ బాబు బ్యాచ్ మొత్తం మోడీని ఆకాశానికెత్తేశారు. అయినప్పటికీ మోడీ మాత్రం బాబును నమ్మలేదు. పైగా ఘోరంగా అవమానించడం మొదలెట్టాడు. ఓటుకు కోట్లు సహా ఎన్నో కేసుల్లో ఇరుక్కుని ఉన్న బాబుకు మోడీని వ్యతిరేకించే ధైర్యం లేదు. అందుకే ఆ బాధ్యతను బాబు భజన మీడియా అధినేత రాధాకృష్ణ తీసుకున్నాడు.

ఒకసారి వ్యతిరేకిస్తే రాధాకృష్ణ రాతలు ఎలా ఉంటాయో తెలిసందేగా. జగన్‌కి మందు అలవాటు లేకపోవడం, తనను నమ్మినవాళ్ళను ప్రేమగా చూసుకోవడం లాంటి లక్షణాలను దుర్మార్గంగా చూపిస్తూ విమర్శించిన వ్యక్తి రాధాకృష్ణ. ఇక ఈరోజు వ్యాసంలో కూడా జగన్ విలువలు పాటించడం తప్పు అని చెప్పి చాలానే రాసుకొచ్చాడు. జగన్ గురించిన రాతలు పక్కన పెడితే ఇప్పుడు మోడీ విషయంలో కూడా జగన్‌పై రాసిన రాతల్లాంటివే రాసే ప్రయత్నంలోకి వచ్చేశాడు రాధాకృష్ణ. ట్రిపుల్ తలాక్ చట్టంతో కుల, మతాలకు సంబంధం లేకుండా భారతీయులందరి మనస్సులూ గెల్చుకున్నాడు మోడీ. అలాంటి మంచి పేరు మోడీకి రావడం రాధాకృష్ణకు నచ్చలేదు. అందుకే తలాక్…మోదీ జాదూ……..అంటూ చాలా పెద్ద వ్యాసమే రాసిపడేశాడు. హిందువుల సాంప్రదాయాలను హేళన చేయడానికి కూడా రెడీగా ఉండే మన సోకాల్డ్ మేధావులు, నాయకులు ముస్లిం మతంలో ఉండే దురాచారాలపై కనీసం మాట్లాడడానికి కూడా ధైర్యం చేయరు. ముస్లిం మహిళల కష్టాల గురించి మాట్లాడమంటే భయపడి చచ్చే చవట నాయకులే ఎక్కవ మంది. అలాంటి నేపథ్యంలో మోడీ చాలా ధైర్యంగా మొదటి అడుగువేశాడు. మతాన్ని అడ్డుపెట్టుకుని తప్పులు చేసుకుంటూ పోతాం అంటే ……ఆయా మతాల ఓట్ల కోసం చేతులు ముడుచుకు కూర్చునే లాంటి నాయకుడిని కాదు అన్న ఒక హెచ్చరిక కూడా పంపుతూ చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. తను తీసుకొస్తున్న మంచి చట్టం పుణ్యమా అని మోడీకి చాలా మంచి పేరు వచ్చింది. అయితే చంద్రబాబును ఘోరంగా అవమానిస్తున్న, పచ్చ బ్యాచ్‌ని తీసిపడేస్తున్న మోడీకి పేరు రావడం రాధాకృష్ణకు నచ్చలేదు. హోదా విషయంలో సీమాంధ్రులను దగా చేసినప్పుడు కూడా మోడీని సమర్థించిన ఆర్కే…….ఇప్పుడు తలాక్ లాంటి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం కువిమర్శలతో చెలరేగిపోయాడు. బాబును అవమానిస్తున్నాడు కాబట్టి మోడీని అవమానించాలన్న దురద తప్ప రాధాకృష్ణ విశ్లేషణలో అస్సలు పసలేదు. ఇక మోడీ భార్య ప్రస్తావన గురించి తీసుకుని వస్తూ, హిందువుల భార్యల గురించి ఆర్కే చేసిన కామెంట్స్ అయితే అమానవీయంగా ఉన్నాయి.

తలాక్….. మోడీ జాదూ అంటూ రాధాకృష్ణ చేసిన విమర్శల విన్యాసం చూస్తే అర్థమయ్యే విషయం ఒక్కటే. జగన్‌లో ఉన్న మంచిని కూడా చెడుగా చూపిస్తూ, జగన్‌ని రాక్షసుడని చెప్పి కొంతమందిని అయినా నమ్మించడంలో సక్సెస్ అయిన రాధాకృష్ణ…….ఇప్పుడు మోడీ విషయంలో కూడా అలాంటి దుర్మార్గపు జర్నలిజానికి రెడీ అయిపోయాడు. ముందు ముందు రాధాకృష్ణ వికృత రాతలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -