Saturday, May 3, 2025
- Advertisement -

తెలంగాణపై జనసేన గురి.. !

- Advertisement -

ఏపీలో ప్రస్తుతం జనసేన పార్టీ రోజు రోజుకు బలం పెంచుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ దృష్టి తెలంగాణపై పడినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జనసేన తెలంగాణ ఎంట్రీపై రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ తాజాగా ఈ వార్తలపై వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాలలోను అలాగే 7 నుంచి 14 ఎంపీ స్థానాలలోను జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో కూడా ఈ దోస్తీని కొనసాగిస్తుందా అనే దానిపై కూడా వివరణ ఇచ్చారు పవన్. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండబోదని చెబుతూనే.. రాజకీయంగా మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే తమతో ఏ పార్టీ పొత్తు కోరిన స్వాగతిస్తామని పవన్ వెల్లడించారు..

ఇక తెలంగాణలో జనసేన ఎంట్రీతో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, వంటి పార్టీలతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ వంటి పార్టీలు కూడా అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి ముచ్చటగా మూడవసారి అధికారం చేజిక్కించుకోవాలని అటు అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరగబోతోంది.. ఏ పార్టీకి లాభం చేకూరనుంది అనే ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్ లకు కారణం అవుతోంది. ఇక టీడీపీ కూడా ఇటీవల తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఏపీ పార్టీలు అయిన జనసేన టీడీపీతో పాటు తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ తెలంగాణ, మరియు బి‌ఆర్‌ఎస్ పార్టీలతో ఈసారి టి‌ఎస్ ఎలక్షన్లు రసవత్తరంగా మారనున్నాయి. అయితే ఇప్పటివరకు ఎవరికి వారే అన్నట్లు ఉన్న ఈ రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఎవరి పక్షాన చేరతారనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

జనసేన దెబ్బ.. బీజేపీ అబ్బా !

తెలంగాణపై బాబు గురి.. ఖమ్మం నుంచే మొదలు !

లోకేశ్ పాదయాత్ర..లైన్ క్లియర్ కానీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -