Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణపై బాబు గురి.. ఖమ్మం నుంచే మొదలు !

- Advertisement -

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ అత్యంత బలమైన పార్టీగా ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కేవలం ఏపీ కే అధిక ప్రదాన్యత ఇస్తూ వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ప్రభావం గట్టిగానే కొనసాగినప్పటికి, 2018లో మాత్రం పూర్తిగా చతికిల పడింది. ఇటు ఏపీలో కూడా 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయీ ప్రతిపక్ష పార్టీగా మిగిలింది టీడీపీ. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇక అదే విధంగా తెలంగాణలో కూడా తిరిగి మళ్ళీ పుంచుకోవాలని.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు చంద్రబాబు. .

అందుకే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించారు. ఇక అప్పటి నుంచి తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. తరచూ పార్టీ నేతలతో చర్చలు జరపడం, సమావేశాలు నిర్వహించడం చేస్తూ పార్టీ పూర్వ వైభవం కోసం పాటు పడుతున్నారు చంద్రబాబు.. అందులో భాగంగానే గతంలో టీడీపీక పట్టున్న కొన్ని ప్రాంతాలపై చంద్రబాబు గురిపెట్టారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో బి‌ఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ వంటి పార్టీలకు చెపుకోదగ్గ స్థాయిలో బలం లేదు. అందుకే తెలుగుదేశం తెలంగాణలో తిరిగి పుంజుకోవడానికి కమ్మం జిల్లనే కరెక్ట్ అని భావించిన బాబు.. తాజాగా జిల్లాలో పర్యటించారు.

2019 ఎన్నికల నేపథ్యంలో చివరిసారిగా రాహుల్ గాంధీతో కలిసి ఖమ్మంలో పర్యటించిన బాబు.. దాదాపు నాలుగేళ్ల తరువాత ఇప్పుడు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను అభివృద్ది చేసింది టీడీపీనే అని, బాబు చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లాను అలాగే హైదరబాద్ ను అభివృద్ది పథంలో నడిపించిన ఘనత టీడీపీదే నంటూ వ్యాఖ్యానించారు. హైదరబాద్ ఇప్పుడు విశ్వ నగరంగా మారడానికి కారణం తెలుగుదేశం పార్టీ దూరదృష్టే అంటూ బాబు చెప్పుకొచ్చారు. ఇలా చంద్రబాబు తనదైన రీతిలో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిచారు. మొత్తానికి తెలంగాణలో ఉనికే కోల్పోయిన పార్టీకి తిరిగి జీవం పోసేందుకు చంద్రబాబు ధృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరి టీడీపీ తెలంగాణలో తిరిగి పునర్జీవం పొందుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

లిక్కర్ స్కామ్.. మొత్తం కవితదే ?

అంబటి టార్గెట్ గా.. పవన్ “సైలెంట్ మిషన్” !

పవన్ చూపు అటువైపే.. హింట్ ఇచ్చాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -