తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్తి రేసులో చాలా మందే ఉన్నారు. డీకె అరుణ, జైపాల్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనర్సింహ ఇలా చాలా మంది ఆశావహులు ఉన్నారు. వాల్లందరిన్నీ కాదని సీఎం పదవి రేవంత్‌కు వస్తాదంటే అది హాస్యాస్పదమే అవుతుంది.
తాజాగా రేవంత్‌రెడ్డిపై సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు. నిన్నగాక మొన్నచ్చి సీఎం అభ్యర్తిని తానే అంటూ రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీనిర్‌నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలోని సీనియర్లను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బంగారం చేస్తానన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి … అంత సత్తా ఉంటే టీడీపీనే బంగారం చేసి ఉండాల్సిందని హితవుపలికారు.
ప్రజాసమస్యలపై తాను ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నానని… తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం కాదనుకుని నిరవధిక దీక్షకు దిగానని, నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యపై దీక్ష చేపట్టానని చెప్పారు. తనను సరిగ్గా వాడుకోకపోతే కాంగ్రెస్ కే నష్టమని రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. పీసీసీపై విమర్శలు గుప్పించడం మంచిది కాదని, కాంగ్రెస్ ను తానే నడిపిస్తున్నట్టు వ్యాఖ్యానించడం అభ్యంతరకరమని చెప్పారు.
రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మరో సీనిర్‌నేత పొంగులేటి ఘాటుగా స్పందించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత విషయం అన్నారు. పార్టీలోకి వచ్చిన నాలుగు రోజులకే రేవంత్ ఈ స్థాయిలో మాట్లాడటం మంచిది కాదని అన్నారు. సీఎం పదవి గురించి మాట్లాడే సమయం ఇది కాదని చెప్పారు.
రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యవస్థ అని, వ్యక్తులతో పార్టీ నడవదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పద్ధతులను రేవంత్ మొదట అర్థం చేసుకోవాలని సూచించారు. పార్టీలో తనంత సీనియర్ ఎవరూ లేరని, అయినా పదవులు వచ్చినా, రాకపోయినా తాను పని చేస్తూనే ఉంటానని చెప్పారు.
రేవంత్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియాకు పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని ఆయనకు వివరించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా రేవంత్ ను కట్టడి చేయాలని ఆయన్ను కోరారు.