Saturday, May 4, 2024
- Advertisement -

టీడీపీలో ఈ వాణి కూడా కూర‌లో క‌రివేపాకేనా..?

- Advertisement -

ప్ర‌స్తుతం అన్ని రాజ‌కీయ పార్టీల‌కు సినీ గ్లామ‌ర్ ఉంది. ఇండ‌స్ట్రీలో పేర సంపాదించి పెళ్లి చేసుకొని ఫేడౌట్ అయిన ఆరిస్టులు రాజ‌కీయాల్లోకి రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయ్యింది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీపార్టీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫేడౌట్ అయిన ఆరిస్టులు పార్టీలోకి ఇలా వ‌చ్చి అలా వెల్ల‌డం చూస్తున్నాం. పార్టీలోకి రావ‌డం జ‌గ‌న్‌ను నాలుగు మాట‌లు అన‌డం త‌రువాత ..బాబును బండ బూతులు తిడుతూ బ‌య‌ట‌కు వెల్ల‌డం కొత్తేమికారు. టీడీపీలో జ‌య‌ప్ర‌ద‌, క‌విత లాంటి పేర్లు చెప్ప‌కుంటూ పోతె అనేక మంది ఉన్నారు. వారిని బాబు కూర‌లో క‌రివేపాకులా వాడు వాడుకోవ‌డం వెన్నుతో పెట్టిన విద్య‌.

కొద్ది రోజుల క్రితం అల‌నాటి స్టార్ హీరోయిన్ వాణివిశ్వ‌నాధ్‌ బాబు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. పార్టీలో చేరిన త‌ర్వాత పెద్ద పెద్ద‌మాట‌లే మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీ చేసి గెలుస్తాన‌ని స‌వాల్ విసిరింది. తనది కూడా చిత్తూరు అని రోజా మీద పోటీ చేస్తానని కూడా స్టేట్మెంట్లు ఇచ్చింది. క‌బ‌ర్ధార్ రోజా అంటూ నేను నీనోరు మూయించ‌డానికే వ‌చ్చానంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. అప్పట్లో వాణిని బాగానే టీడీపీ ఎంకరేజ్ చేసింది. త‌రువాత ఏమైందో గాని టీడీపీలో వాణివిశ్వ‌నాధ్‌ అడ్ర‌స్‌ గ‌ల్లంత‌య్యింది. గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు చనిపోవ‌డంతో న‌గ‌రి నియోజ‌క వ‌ర్గాన్ని త‌న‌కు కేటాయిస్తార‌ని వాణ పాట హీరోయిన్ గంపెడు ఆశ‌లు పెట్టుకుంది. అయితే న‌గ‌రి సీటును గాలి వార‌సుల‌కు ఇచ్చేందుకు బాబు సిద్ద‌మ‌య్యారు. చేసేదేమి ల‌క దీంతో వాణి సైడ్ అయిపోయింది.

ఇప్పుడు తాజాగా పెళ్లిపుస్త‌కం హీరోయిన్ దివ్య‌వాణి వంతు వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌నే టీడీపీ తీర్థం పుచ్చుకుంది. ఇంకే ముంది త‌న నోటికి పని చెప్పింది. ఢిల్లీలో బాబు చేసిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో ప్ర‌ధాని మోదీపై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేసింది. అసులు ఈమె పెళ్లిపుస్త‌కంలో హీరోయిన్నేనాని జ‌నాలు అనుకుంటున్నారు.

మ‌రి ఈ వాణి పార్టీలో ఎన్నిరోజులు ఉంటుందో అర్థం కాని ప‌రిస్థితి. పార్టీకి అవ‌స‌రం అయిన‌ప్పుడు వాడుకోవ‌డం త‌ర్వాత వాళ్ల‌ను దూరం పెట్ట‌డం బాబుకు అల‌వాటు. ఆవాణి పోతె ఇప్పుడు పెళ్లిపుస్త‌కం వాణి వ‌చ్చింది. మ‌రి ఈ వాణి గ్లామ‌ర్ పార్టీకి ఎంత మేర‌కు ఉప‌యోగ ప‌డుతుందో.. హ‌డావుడి పార్టీలో ఎన్నిరోజులు ఉంటుందో చూడాలి. గ‌తంలో వాణి ఇశ్వ‌నాధ్‌కు రోజా స‌ల‌హాలు కూడా ఇచ్చింది.రాజ‌కీయాల‌కోసం వాడుకుంటారు…ఆడుకుంటారు చివ‌ర‌కు నీకు కూడా అదే గ‌తి అంటూ హెచ్చ‌రించింది. రోజా హెచ్చ‌రించిన‌ట్లుగా నే జ‌రిగింది. పార్టీ నుంచి సైడ్ అయిపోయింది. మ‌రి ఈ వాణి త‌ర్వాత పార్టీలోకి ఏవాణి వ‌స్తారో…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -