Thursday, May 8, 2025
- Advertisement -

పనికిరాని పదవులు ఎన్ని ఉండి ఏం లాభం.. అధికారంలో లేనిది..?

- Advertisement -

చంద్రబాబు కి అధికారం కోల్పోయినా జగన్ పై విమర్శలు చేయడం ఏమాత్రం తగ్గించుకోలేదు.. అధికారంలో ఉన్న పార్టీ అని చూడకుండా జగన్ పై గతంలో ఎన్నడూ లేనివిధంగా విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.. అయితే తన ఉనికి ప్రజల్లో చాటుకోవడానికి చంద్రబాబు ఈ పని చేస్తున్నా ప్రజలు మాత్రం మంచి పనులు చేస్తున్న జగన్ పై విమర్శించడాన్ని ససేమీరా ఖండిస్తున్నారు.. అధికారం కోల్పోయిన ఇన్నాళ్లకు చంద్రబాబు కి పార్టీ ని గాడిలో పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది..

అనుకున్నదే తడవుగా పార్టీ ఎక్కడెక్కడ వీక్ గా ఉందో అక్కడ బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ కోవలోనే పార్లమెంట్ నియోజక వర్గాల ఇన్ ఛార్జ్ లను నియమించి అయన పార్టీ ని గాడిలో పెట్టుకునే ప్రయత్నాలు చేశారు.. వీరి ద్వారా పార్టీ ఓడిపోయినా నియోజక వర్గాల్లో పార్టీ చేసిన తప్పులను, కోల్పోయిన నమ్మకాన్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకోనున్నారట..అలాగే పార్టీ లోని సీనియర్ల అసంతృప్తి ని సైతం చంద్రబాబు ఈ దెబ్బతో తీర్చేశాడని చెప్పొచ్చు.. ఇప్పటికే  లెక్కలేన‌న్ని ప‌ద‌వులు సృష్టించారు. ప్రతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికీ క‌మిటీ వేశారు. ఆ క‌మిటీకి కీల‌క నేత‌ను ఇంచార్జ్‌గా నియ‌మించారు. వీటిపై ప్రతి రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ.. ఒక ఇంచార్జ్  ను నియ‌మించారు. దీంతో మ‌రో ప‌ద‌మూడు మందికి ప‌ద‌వులు ద‌క్కాయి.

మొత్తానికి తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న త‌మ్ముళ్లపై చంద్రబాబు ప‌దువుల‌నే చంద‌న‌పు గాలులు వీచేలా చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది.. ఈ పదవులు పార్టీ కి ఏవిధంగా ఉపయోగపడతాయో అర్థం కావట్లేదు.. మితిమీరిన ఈ పదవులు పార్టీ గెలుపుకు ఏవిధంగా దోహదపడతాయి అనేది చూడాలి.. ప్రతి నిర్ణయానికీ ఓ ప‌రిశీల‌న పేరుతో తాత్సారం చేసే ల‌క్షణం ఇటీవ‌ల కాలంలో పార్టీ పెన‌వేసుకుంది. దీనినిముందు విడిచి పెట్టాలి. మంచో చెడో.. కింది స్థాయి నేత‌ల ఆలోచ‌న‌ల‌కు విలువ ఇవ్వాలి. నేనే సీనియ‌ర్‌.. మీరు నామాటే వినాలి.. అనే ధోర‌ణిని వ‌దిలి పెట్టాలి. కానీ, ఇప్పుడు కూడా అది జ‌ర‌గ‌డం లేదు. ఇలా అయితే, క‌ష్టాలు కొన‌సాగుతాయే త‌ప్ప.. ప‌ద‌వులు ప‌రిష్కారం చూపించ‌లేవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ గెలుపుకోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి..

బీజేపీ కి ఉన్న బలం కూడా టీడీపీ కి లేదా…!

టీడీపీ నేత కారు పై వైసీపీ నేతల విధ్వంసం..?

ఛీ. పొమ్మన్న చంద్రబాబు బీజేపీ చెంతకే వెళ్తున్నాడంటే.?

చంద్రబాబు కు ఇప్పుడు వాళ్ళే దిక్కా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -