Saturday, May 4, 2024
- Advertisement -

బీజేపీ కి ఉన్న బలం కూడా టీడీపీ కి లేదా…!

- Advertisement -

రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ కి లేనంత అయోమయం ఇప్పుడు టీడీపీ కి ఉంది.. ఇప్పటివరకు ఏ ప్రతిపక్ష పార్టీ కి ఎదురవ్వని విచిత్ర పరిస్థితి, ఎదురవ్వని చేదు అనుభవాలు టీడీపీ కి ఎదురవుతుంది..అందుకు కారణం తిరుపతి లోని ఉప ఎన్నిక అని చెప్పాలి.. చంద్రబాబు ఉప ఎన్నిక విషయంలో తొందరపడి ఫూల్ అవకుండా ఆచి తూచి తన రాజకీయ మెదడు కు పదును పెట్టె పనిలో ఉన్నారు..  గతంలో చేసిన తప్పులు చేసి నిరాశ పడేకంటే, అసలే ప్రజల బలం లేనప్పుడు పోటీ చేసి ఓడిపోయే కంటే బీజేపీ లాంటి పార్టీ కి సపోర్ట్ చేద్దామని అయన ఎత్తుగడ వేస్తున్నారు..

వాస్తవానికి ఇప్పుడు బీజేపీ కి ఉన్న బలం టీడీపీ కి లేదు అందుకు తిరుపతి లో టీడీపీ కి కొంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పోటీ చేయకుండా ఉండడమే మంచిది అని చంద్రబాబు భావిస్తున్నారు.. బీజేపీ ఇటీవలే కాలంలో కొంత పుంజుకుంది. కేంద్రం అధికారంలో ఉండడంతో బీజేపీ పై ప్రజలకు ఎలాగూ మంచి అభిప్రాయమే ఉంటుంది.. ఇలాంటి సమయంలో బీజేపీ కి సహకరిస్తే ప్రజల్లో మంచి పేరు రావడం తో పాటు , కేంద్రం ద్రుష్టి లో విలన్ గా మిగిలిపోయిన తనని హీరో చేసుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారట.. అయితే ఓ వైపు చంద్రబాబు ఇలా ఆలోచిస్తుంటే బీజేపీ మాత్రం చంద్రబాబు స్థానానికే ఎసరుపెట్టేలా చేస్తుండడం ఇప్పుడు ఎంతో ఆసక్తి కరంగా మారిపోయింది..

గ‌త ఎన్నిక‌ల్లో తిరుప‌తి లోక్ స‌భ నుంచి టీడీపీ త‌ర‌ఫున ప‌న‌బాక ల‌క్ష్మి పోటీ చేశారు.  అయితే ఆమె అక్కడ దారుణంగా ఓడిపోయారు.. వైసీపీ ప్రభంజనంలో ఆమె కూడా కొట్టుకుపోయారు.. అయితే తిరిగి ఇక్కడ ఎలక్షన్స్ పెడుతుండడంతో  ఈసారి ఎలాగైనా మ‌ళ్లీ పోటీ చేయాల‌ని ఆమె భావిస్తున్నారు. టీడీపీ పోటీలో ఉండేలా లేదు. ఒక‌వేళ ఉన్నా ఆ పార్టీ నుంచి అయితే గెలిచే అవ‌కాశాలు లేవ‌ని ఆమె భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.ఇదే అదునుగా బీజేపీ ఆమె ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్లుగా మ‌రో వార్త ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌న‌బాక కూడా బీజేపీ గూటికి చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నార‌న్న ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. బీజేపీ కి అయితే ఇక్కడ ఒక మంచి లీడర్ అయితే ఎవరు దొరకలేదు.. అదేదో ఈమెనే తీసుకుంటే పోతుంది కదా అని వారు భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.. 

టీడీపీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న టీడీపీ నేతలు..?

అయోమయంలో టీడీపీ ఇన్ ఛార్జ్ లు…

ఎన్టీఆర్ కూడా మొదలుపెట్టడా.. భార్య తో కలిసి..?

జగన్ కంటే బాబు హయంలోనే ఎక్కువ దాడులు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -