Friday, May 17, 2024
- Advertisement -

అక్కడ టీడీపీ నాయకులూ సేఫ్ గేమ్ ఆడుతున్నారా….?

- Advertisement -

టీడీపీ కి గతంలో ఎపుడు రాని, లేని పరిస్థితి ఇప్పుడు ఎదురయ్యింది.. తమ పార్టీ అధికారంలో లేదని చాలామంది టీడీపీ నాయకులూ ఇప్పుడు సైలెంట్ గా ఉండడంతో ఆ పార్టీ ఎలాంటి ప్రభుత్వం వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అధినాయకుడు కూడా సోషల్ మీడియా తో పరిమితమవడంతో వారు కూడా పార్టీ ని పెద్దగా పట్టించుకోవడం లేదు.. ఒకవేళ పార్టీ కోసం పనిచేసే ప్రభుత్వం పై వ్యతిరేక నినాదాలు చేద్దామంటే కొందరు టీడీపీ నేతలకు పట్టిన గతి పడుతుండేమని భయపడిపోతున్నారు. అంతేకాదు తాము ఎవరి మీదనైతే ఓడిపోయామో వారితో లోపాయకారి ఒప్పందానికి వచ్చి ఇన్ డైరెక్ట్ గా టీడీపీ ని వదిలేసినట్లుగా కనిపిస్తున్నారు..

ఇక ఉత్తరాంధ్రలోని కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తుందట. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కు చెందిన బొత్స స‌త్యనారాయ‌ణ వైసీపీ పార్టీ లో ఎంతటి కీలకమైన వ్యక్త్తో అందరికి తెలిసిందే. అక్కడ ఓడిన అందరు టీడీపీ నేతలు బొత్స తో వైరాన్ని కొనితెచ్చుకోవద్దని ఆయనతో లాలూచిపడే ఆలోచనలో ఉన్నారని, ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు అక్కడి వైసీపీ కి దాసోహం అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత‌, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి, ప‌తివాడ నారాయ‌ణ స్వామి, ఆయ‌న కుమారుడు త‌మ్మినాయుడు,, బొడ్డుకొండ అప్పల‌నాయుడు వీరంతా బొత్స తో మంచి రిలేషన్ మైంటైన్ చేయడంతో పాటు ఆయనకు అన్ని విషయాల్లో సహరిస్తున్నారట..

ఇంకా చీపురుప‌ల్లిలో కిమిడి మృణాళి & ఫ్యామిలీ కూడా వైసీపీ కి సపోర్ట్ గా ఉందట.. అయితే రాష్ట్ర నాయకుల స్థాయిలోనే కాదు జిల్లా, మండల, గ్రామా స్థాయిలో ఇక్కడి టీడీపీ నేతలు ఎవరు అధికారంలోకి వస్తే వారికీ సపోర్ట్ గా నిలుస్తున్నారట. టీడీపీ నాయ‌కులు బొత్స స‌త్యనారాయ‌ణకు అనుకూలంగా మార‌డంతో జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని అంటున్నారు.అక్కడ అశోక్ గ‌జ‌ప‌తిరాజు వంటివారు ఉన్నా ఆయ‌న వ‌య‌స్సు పైబ‌డ‌డంతో జిల్లా పార్టీని పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేదు అని వాదన వినిపిస్తుంది. ఇదిలా పోతు ఉంటే ఈ సంస్కృతి అన్ని ప్రాంతాలకు పాకి టీడీపీ పసుపు జెండా కాస్త వైసీపీ గా మారే అవకాశం కనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -