Tuesday, May 7, 2024
- Advertisement -

వైసీపీ ఎంపీలు ధ‌ర్నాచేసే వేదిక‌లో మార్పు…?

- Advertisement -

పార్ల‌మెంట్ స‌మావేశాల త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఏపీకి సంబంధంచిన విభ‌జ‌న హామీల‌ను బ‌డ్జెట్‌లో పెట్ట‌క‌పోవ‌డంపై అన్ని పార్టీలు ర‌గిలిపోతున్నాయి. విభ‌జ‌న హామీల‌తోపాటు ప్ర‌త్యేక హోదాకోసం వైసీపీ త‌న పోరును ఉదృతం చేస్తోంది. మార్చిలోజరిగే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో విభ‌జ‌న హామీలు, ప్ర‌త్యేక‌హోదాపై స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌కుంటే ఎంపీలు రాజీనామాలు చేసేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తితెల‌సిందే. అందుకే ముందుగా ఢిల్లీలో ధ‌ర్నా చేయాల‌ని నిర్ణ‌యించారు.

మార్చి 5వ తేదీన ఢిల్లీ వేదికగా వైసిపి ఎంపిలు, ఎంఎల్ఏలు, నేతలు భారీ ధర్నా చేస్తారని జగన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొద‌ట పార్టీ నేతలు, శ్రేణులు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నాలో పాల్గొనేట్లు, జగన్ యధావిధిగా పాదయాత్ర కంటిన్యూ చేసేట్లుగా ముందు నిర్ణయమైంది. అయితే తర్వాత నేతల ఆలోచనలో మార్పు వచ్చిందట.

పార్టీ తరపున అంత భారీ ఎత్తున నిరసన, ఆందోళన చేసే సమయంలో పార్టీ అధ్యక్షుడు లేకపోతే బాగుండదని నేతలు అనుకున్నారట. అందుకనే ఎంపిలు మాట్లాడుతూ మార్చి 5వ తేదీకి జగన్ ను కూడా ఢిల్లీకి రావాల్సిందేనంటూ పట్టుపట్టారట. దాంతో జగన్ కూడా సుముఖంగానే ఉన్నారట. అందుకే జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇచ్చి ఢిల్లీలో పార్టీ నేత‌లు చేప‌ట్ట‌నున్న ధ‌ర్నాలో జ‌గ‌న్ పాల్గొన‌నున్నారు.

పాదయాత్రకు బ్రేక ఇచ్చి ఢిల్లీకి రావాలంటూ నేతలు కూడా జగన్ తో గట్టిగా చెబుతున్నారట. జంతర్ మంతర్ లో ఆందోళన చేయాలని తొలుత అనుకున్న వేదిక మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.జ‌గ‌న్ ధ‌ర్నాకు హాజ‌ర‌యితే హైలెట్ అవుతుంద‌నేది నేత‌ల భావ‌న‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -