Tuesday, May 21, 2024
- Advertisement -

క‌డ‌ప‌జిల్లాలో పార్టీనేత‌ల మ‌ధ్య‌నున్న విబేధాల‌పై దృష్టిసారించిన బాబు..

- Advertisement -

నియోజ‌క వ‌ర్గాల్లో సొంత పార్టీనేత‌ల మ‌ధ్యున‌న్న విభేధాలు చంద్ర‌బాబుకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఫార్టీ పిరాయింపుల‌కు పెద్ద‌పీట వేసిన బాబుక‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఫిరాయింపు నేల‌కు, సొంత‌పార్టీనేత‌ల‌కు మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. రాష్ట్రంలోని చాలా నియోజ‌క వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నియోజ‌క వ‌ర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌య‌రాములు, మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ మ‌ధ్య ఆధిప‌త్య పోరు గ‌త కొన్ని రోజుల‌గా కొన‌సాగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ ఆధిప‌త్యాన్ని త‌గ్గించాల‌ని చూస్తున్న బాబుకు వ‌ర్గ‌పోరు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అయితే ఇద్ద‌రు నేత‌లు ఒక‌ట‌వ్వ‌డం బాబుకు కొత ఊర‌ట క‌లిగించే విష‌యం.

బద్వేల్ నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటనను పురస్కరించుకొని కడప జిల్లా ఇంచార్జీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇరు వర్గాల మధ్య సయోధ్యను కుదిర్చారు. కడప జిల్లా బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. అయితే ఈ రెండు గ్రూపుల మధ్య కొంతకాలంగా పొసగడం లేదు. అయితే పార్టీని నడిపించేందుకుగాను జిల్లా ఇంచార్జీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నడుంబిగించారు.

బద్వేల్ మాజీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కూతురు విజయమ్మ. వీరారెడ్డి మృతి తర్వాత ఆయన కూతురు విజయమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో ఆమె పోటీ చేసీ ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఆమె బద్వేల్ నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జీగా కొనసాగుతోంది. 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేశారు.

దీంతో విజయమ్మ సూచించినవారికే టీడీపీ టిక్కెట్టును కేటాయిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కమలమ్మ విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్ధిగా విజయజ్యోతి పోటీ చేసింది. అయితే వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జయరాములు చేతిలో విజయజ్యోతి ఓటమిపాలైంది.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి సహా ఇతర ముఖ్య నేతలు ఎమ్మెల్యే జయరాములును తీసుకొని టీడీపీ బద్వేల్ ఇంచార్జీ విజయమ్మ ఇంటికి తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య రాజీని కుదిర్చారు. పార్టీ అధిష్టానం ఏం చెబితే దాన్ని పాటిస్తామని ఇంచార్జీ విజయమ్మ, ఎమ్మెల్యే జయరాములు ప్రకటించారు. ఇద్ద‌రూ ఒక‌టిగా ప‌నిచేస్తే వైసీపీకీ ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -