తెలంగాణాలో బీజేపీ పార్టీ రోజు రోజుకు కొంత బలపడుతుందని చెప్పాలి.. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కొంత దూకుడుగా ఉంటూ పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత సఫలమయ్యారు.. తెలంగాణాలో ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ పార్టీ ని ఓడించాలన్నది వారి అభిమతం కాకపోయినా ప్రత్యామ్నాయ పార్టీ గా అయినా వచ్చే ఎన్నికల నాటికి చేయాలనీ బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు.. ఇప్పటికే ప్రజలలో బీజేపీ పై కొంత నమ్మకం ఏర్పడిందని పార్లమెంట్ ఎన్నికల్లో తెలిసిపోయింది.. ఈ నేపథ్యంలో ఆ నమ్మకాన్ని పెంచుకుని పొతే విధంగా వారు పనిచేస్తున్నారు..
ఇక మొదటగా పార్టీ లోకి వచ్చే ఇతర నేతలపై వారు ఎక్కువ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి గుర్తింపు నిస్తూ బీజేపీ అధిష్టానం చేస్తున్న ఈ వ్యవహారం అందరిని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తుంది.. దక్షిణాదిన కొద్దోగొప్పో బీజేపీకి అవకాశాలున్న రాష్ట్రం కర్ణాటక తర్వాత తెలంగాణ మాత్రమే. ఇక్కడ గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు దక్కించుకోవడంతో ఇక్కడ బలోపేతం అవ్వడానికి పావులు కదుపుతుంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా బలహీనం అవుతుండటం కూడా తమకు కలిసి వస్తుందని భావించారు. ఈ నేపథ్యంలో గులాబి పార్టీ కి వ్యతిరేకంగా ఉన్న నేతలను తమవైపు లాక్కునేందుకు వారు వేస్తున్న వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తుంది..
కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర నాయకత్వం. వలసలను ప్రోత్సహించాలంటే కొత్త వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకోసమే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. పురంద్రీశ్వరికి జాతీయ కార్యదర్శి పదవి దక్కింది. ఇలా కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని సంకేతాలను పంపడానికే వీరిద్దరికి పదవులను ఇచ్చింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఆలోచనలు పార్టీ కి ఏవిధంగా ఉపయోగపడతాయో చూద్దాం..
గంటా శ్రీనివాసరావు గురించి జగన్ మనసులో మాట..?
జగన్ పై గోరంట్ల అసంతృప్తికి కారణం అతనేనా..?